News November 6, 2024

మళ్లీ కెప్టెన్ అయిన డేవిడ్ వార్నర్

image

ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ మళ్లీ కెప్టెన్సీని చేపట్టారు. బాల్ టాంపరింగ్ కారణంగా ఆయన కెప్టెన్సీ చేయకుండా క్రికెట్ ఆస్ట్రేలియా ఆరేళ్ల క్రితం నిషేధం విధించింది. తాజాగా ఆ నిషేధాన్ని ఎత్తివేయడంతో బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్ ఆయన్ను తమ కెప్టెన్‌గా నియమించింది. అదే జట్టుకు 2011లో వార్నర్ కెప్టెన్‌గా ఉన్నారు. IPLలోనూ SRHకి కెప్టెన్‌గా కప్ అందించారు.

Similar News

News December 8, 2024

WTC: మూడో స్థానానికి భారత జట్టు

image

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్‌లో టీమ్ ఇండియా మూడో స్థానానికి పడిపోయింది. అడిలైడ్ టెస్ట్ తర్వాత మూడో స్థానంలో ఉన్న ఆసీస్ (60.71%) టాప్‌కు వెళ్లింది. ఒకటో స్థానంలో ఉన్న భారత్ (57.29%) మూడో స్థానానికి వచ్చింది. సౌతాఫ్రికా (59.26%) రెండో స్థానంలోనే కొనసాగుతోంది. BGTలో మిగతా 3 టెస్టులు గెలవకపోతే ఇండియా WTC ఫైనల్‌కు చేరే అవకాశాలు సన్నగిల్లుతాయి. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది.

News December 8, 2024

హిందీ గడ్డపై పుష్ప-2 సరికొత్త రికార్డు

image

పుష్ప-2 బాలీవుడ్‌లో అదరగొడుతోంది. 3 రోజుల్లోనే ₹205 కోట్లు వసూలు చేసిన తొలి చిత్రంగా నిలిచినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో జవాన్(₹180Cr), యానిమల్(₹176Cr), పఠాన్(₹161Cr) సినిమాలను అల్లు అర్జున్ వెనక్కు నెట్టారు. అలాగే హిందీలో తొలి 3 రోజుల్లో రెండు రోజులు ₹70Cr మార్క్‌ను దాటిన తొలి చిత్రంగా పుష్ప-2 నిలిచింది. ఈ మూవీ గురువారం ₹72Cr, శుక్రవారం ₹59Cr, శనివారం ₹74Cr సాధించింది.

News December 8, 2024

యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నాం: జెలెన్‌స్కీ

image

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్, ఫ్రాన్స్ అధినేత మేక్రాన్‌తో జెలెన్‌స్కీ సమావేశమయ్యారు. రష్యాతో కొనసాగుతున్న యుద్ధాన్ని వీలైనంత త్వరగా, న్యాయమైన మార్గంలో ముగించాలని తామంతా కోరుకుంటున్నట్లు జెలెన్‌స్కీ తెలిపారు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పడం, ప్రజల భద్రతపై చర్చించినట్లు పేర్కొన్నారు. వార్ ముగింపు విషయంలో ట్రంప్ దృఢ నిశ్చయంతో ఉన్నారన్నారు. భవిష్యత్తులోనూ తాము కలిసి పనిచేస్తామని చెప్పారు.