News December 28, 2024
DAY 3: ఈ రోజు భారత్‌దే

బాక్సింగ్ డే టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. 8వ వికెట్‌కు నితీశ్-సుందర్ 127 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నితీశ్ సెంచరీ చేసిన తర్వాత వెలుతురు లేమితో ఆట నిలిచిపోగా ఇవాళ్టికి ఆటను ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. తొలి ఇన్నింగ్సులో AUS 474 పరుగులు చేయగా భారత్ 116 పరుగులు వెనుకబడి ఉంది. AUS బౌలర్లలో కమిన్స్, బోలాండ్ చెరో 3 వికెట్లు తీశారు.
Similar News
News October 18, 2025
PM జన్మన్ అమలులో TGకి మూడో ర్యాంక్

ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(PM JANMAN) అమలులో తెలంగాణ రాష్ట్రం జాతీయస్థాయిలో మూడో ర్యాంక్ సాధించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన ‘ఆది కర్మయోగి అభియాన్’ జాతీయ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. గిరిజన సమూహాల సమాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగు పరిచేందుకు కేంద్రం 2023 నవంబర్‌లో ఈ పథకం ప్రారంభించింది.
News October 18, 2025
నేడు ఇలా చేస్తే సకల శుభాలు

నేడు ధన త్రయోదశి పర్వదినం. ఈరోజున ధన్వంతరి, లక్ష్మీదేవి, కుబేరుడు, వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలని పండితులు చెబుతున్నారు. ‘ఈ శుభ దినాన బంగారం, వెండి, లోహ పాత్రలు, కొత్తిమీర, కొత్త చీపురు కొనడం శుభప్రదం. ప్రధాన ద్వారం వద్ద యముడికి దీపాన్ని దానం చేయడం ద్వారా అకాల మృత్యు భయం తొలగుతుంది. తెల్లని వస్తువులు దానం చేస్తే లక్ష్మీ, కుబేరుల అనుగ్రహం లభించి, సంపద వర్షిస్తుంది’ అని పేర్కొంటున్నారు.
News October 18, 2025
నేడు ఉద్యోగ సంఘాలతో చర్చలు

AP: నేడు సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో కీలక చర్చలు జరగనున్నాయి. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో మంత్రుల బృందం వారితో సమావేశంకానుంది. పీఆర్సీ అమలు, డీఏ బకాయిలు, జీపీఎఫ్, పీఎఫ్ సమస్యలు, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధిత సమస్యలపై చర్చించనున్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, సీఎస్ విజయానంద్ ఈ భేటీలో పాల్గొంటారు.