News December 28, 2024

DAY 3: ఈ రోజు భారత్‌దే

image

బాక్సింగ్ డే టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. 8వ వికెట్‌కు నితీశ్-సుందర్ 127 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నితీశ్ సెంచరీ చేసిన తర్వాత వెలుతురు లేమితో ఆట నిలిచిపోగా ఇవాళ్టికి ఆటను ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. తొలి ఇన్నింగ్సులో AUS 474 పరుగులు చేయగా భారత్ 116 పరుగులు వెనుకబడి ఉంది. AUS బౌలర్లలో కమిన్స్, బోలాండ్ చెరో 3 వికెట్లు తీశారు.

Similar News

News January 22, 2025

OTTలోకి వచ్చేస్తున్న పుష్ప-2.. ఎప్పుడంటే?

image

బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసిన పుష్ప-2 మూవీ OTT స్ట్రీమింగ్ డేట్‌పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నెల 29 లేదా 31న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. ప్రస్తుతం 3 గంటల 40 నిమిషాల నిడివితో ఉన్న రీలోడెడ్ వెర్షన్ థియేటర్లలో ప్రదర్శిస్తుండగా, OTTలోనూ ఇదే వెర్షన్‌నే రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమా ఇప్పటివరకు రూ.1850 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది.

News January 22, 2025

గల్ఫ్ ఆఫ్ మెక్సికోను ట్రంప్ గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చగలరా?

image

తీరప్రాంతాల పేర్లు మార్చేందుకు అధికారికంగా అంతర్జాతీయ ఒప్పందాలేమీ లేవు. ఈ వివాదాల పరిష్కారం, సయోధ్యకు ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ (IHO) ప్రయత్నిస్తుంది. ట్రంప్ కోరుకుంటే గల్ఫ్ ఆఫ్ మెక్సికోను US పత్రాల్లో గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చుకోవచ్చు. EX బ్రహ్మపుత్రను చైనాలో సాంగ్‌పో, యార్లంగ్ జంగ్‌బోగా పిలుస్తారు. తమను వేరుచేసే జలసంధిని పర్షియన్ గల్ఫ్‌గా ఇరాన్, అరేబియన్ గల్ఫ్‌గా సౌదీ పిలుస్తాయి.

News January 22, 2025

తెలంగాణలో మరో రూ.10వేల కోట్ల పెట్టుబడులు

image

దావోస్ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో కంట్రోల్ ఎస్ సంస్థ ఒప్పందం చేసుకుంది. రూ.10వేల కోట్ల పెట్టుబడితో AI డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు MOU కుదుర్చుకుంది. 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ సెంటర్ ఏర్పాటు కానుండగా, 3600 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. కాగా కంట్రోల్ ఎస్ సంస్థ ఇప్పటికే HYDలో తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది.