News December 15, 2024
DAY2: ఆస్ట్రేలియా భారీ స్కోర్

భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 405/7 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(152), స్టీవ్ స్మిత్(101) శతకాలతో రాణించడంతో ఆసీస్ పటిష్ఠ స్థితిలో నిలిచింది. వీరిద్దరి వికెట్లు తీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్ల ప్రదర్శన చేశారు. మహ్మద్ సిరాజ్, నితీశ్ చెరో వికెట్ తీశారు.
Similar News
News November 20, 2025
వయసు పెరుగుతున్నా.. తగ్గేదేలే!

తెలుగు హీరోలు మహేశ్(50), నాగార్జున(66) సహా పలువురు నటులు వయసు పెరిగే కొద్దీ మరింత యంగ్ లుక్‌లో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. వారి ముఖాల్లో ఏమాత్రం వృద్ధాప్య ఛాయలు కనిపించకపోవడం ‘వయసు వెనక్కి వెళ్తోందా?’ అనే చర్చకు దారితీస్తోంది. ఈ హీరోలు తమ ఫిట్నెస్, లైఫ్‌స్టైల్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్లే ఇలాంటి ‘ఏజింగ్ బ్యాక్‌వర్డ్స్’ లుక్ సాధ్యమవుతోందని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు.
News November 20, 2025
గంభీర్‌పై విమర్శలు.. బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే?

SAతో తొలి టెస్టులో టీమ్ ఇండియా ఓడటంతో హెడ్ కోచ్ గంభీర్‌పై <<18307995>>విమర్శలొచ్చిన<<>> సంగతి తెలిసిందే. దీనిపై బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్పందించారు. ‘గంభీర్ ఒక్కడినే టార్గెట్ చేస్తూ అందరూ మాట్లాడుతున్నారు. బ్యాటర్లు, బౌలర్లు, సపోర్ట్ స్టాఫ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు. కోల్‌కతా పిచ్‌ను మేం బ్లేమ్ చేయట్లేదు. అది అంత త్వరగా టర్న్ అవుతుందని ఊహించలేదు’ అని పేర్కొన్నారు.
News November 20, 2025
ఏపీని మావోలు లేని రాష్ట్రంగా మారుస్తాం: DGP

AP: 2026 మార్చి నాటికి రాష్ట్రంలో మావోయిజాన్ని అంతం చేస్తామని DGP హరీశ్ కుమార్ గుప్తా అన్నారు. రంపచోడవరంలోని AOB ప్రాంతంలో ఆయన ఏరియల్ సర్వే చేశారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు చనిపోయారని తెలిపారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలించారు. 50 మంది మావోలను అరెస్ట్ చేశామన్నారు. APని మావోలు లేని రాష్ట్రంగా మారుస్తామని, ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.


