News December 15, 2024

DAY2: ఆస్ట్రేలియా భారీ స్కోర్

image

భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 405/7 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(152), స్టీవ్ స్మిత్(101) శతకాలతో రాణించడంతో ఆసీస్ పటిష్ఠ స్థితిలో నిలిచింది. వీరిద్దరి వికెట్లు తీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్ల ప్రదర్శన చేశారు. మహ్మద్ సిరాజ్, నితీశ్ చెరో వికెట్ తీశారు.

Similar News

News January 23, 2025

పెట్టుబడులు మూడింతలు.. 46 వేల ఉద్యోగాలు!

image

దావోస్ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వంతో పలు సంస్థలు భారీగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తాజాగా అమెజాన్‌తో కలుపుకొని పెట్టుబడులు మొత్తం రూ.1.32 లక్షల కోట్లు దాటాయి. వీటితో 46 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడం విశేషం. గత ఏడాదితో పోలిస్తే <<15233398>>పెట్టుబడులు దాదాపు మూడింతలు<<>> మించిపోయాయి.

News January 23, 2025

జైలు శిక్షపై స్పందించిన RGV

image

చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు RGVకి 3 నెలలు<<15232059>> జైలు శిక్ష <<>>పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై RGV స్పందించారు. ‘అంధేరీ కోర్టు శిక్ష విధించిన వార్తల గురించి స్పష్టం చేయాలి అనుకుంటున్నా. ఇది నా మాజీ ఉద్యోగికి సంబంధించిన 7ఏళ్ల క్రితం నాటి రూ.2.38లక్షల చెక్ బౌన్స్ కేసు. దీనిపై నా న్యాయవాదులు కోర్టుకు హాజరవుతున్నారు. ఈ విషయం కోర్టులో ఉన్నందున ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను’ అని తెలిపారు.

News January 23, 2025

వచ్చే నెల 6న ఏపీ మంత్రివర్గ భేటీ

image

AP: ఫిబ్రవరి 6న ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది. సీఎం అధ్యక్షతన దావోస్ పర్యటన, అమరావతి, పోలవరం పనులు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించనుంది. వాట్సాప్ గవర్నెన్స్‌ వంటి అంశాలపై నిర్ణయం తీసుకోనుంది.