News January 27, 2025
డివిలియర్స్ ఐపీఎల్‌లో సరైన ఫ్రాంచైజీకి ఆడలేదు: మంజ్రేకర్

AB డివిలియర్స్ IPLలో సరైన ఫ్రాంచైజీకి ఆడలేదని క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. డివిలియర్స్ తన కెరీర్లో ప్రధానంగా ఆర్సీబీకి మిడిల్ ఆర్డర్‌లో ఆడిన సంగతి తెలిసిందే. ‘అతడిని ఆర్సీబీ సరిగ్గా ఉపయోగించలేదు. బ్యాటింగ్‌లో మరింత ముందుగా పంపించి ఉంటే ఫలితాలు వేరేగా ఉండేవి. ఇలా అంటున్నా అని తప్పుగా అనుకోవద్దు. వేరే ఏ ఫ్రాంచైజీకి ఆడినా AB గొప్పదనాన్ని మనం చూసి ఉండేవాళ్లం’ అని పేర్కొన్నారు.
Similar News
News February 9, 2025
పరగడుపున వీటిని తింటున్నారా?

పరగడుపున కొన్ని ఆహార పదార్థాలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఏమీ తినకుండా నిమ్మ, నారింజ, దానిమ్మ పండ్లు తీసుకుంటే గ్యాస్ సమస్యలు వస్తాయి. ఉప్పు, కారం, మసాలా ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోకూడదు. డీప్ ఫ్రై చేసిన పదార్థాలు తింటే పొట్ట ఉబ్బరం, అజీర్తి కలుగుతాయి. తీపి పదార్థాలు, టీ, కాఫీ తీసుకుంటే ఎసిడిటీ వస్తుంది. ఐస్‌క్రీమ్, కూల్‌డ్రింక్స్ తాగకూడదు. నిల్వ పచ్చళ్లు, చీజ్ తినకూడదు.
News February 9, 2025
రేపు ఆల్బెండజోల్ మందుల పంపిణీ

APలో ఈ నెల 10న జాతీయ నులిపురుగుల నివారణ దినాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లోని 1-19 ఏళ్లలోపు ఉన్న వారికి ఆల్బెండజోల్-400 మిల్లీ గ్రాముల మాత్రలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 10న హాజరు కాని వారికి 17వ తేదీన అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి 6 నెలలకోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
News February 9, 2025
NRIలు, NRTS సభ్యులకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సభ్యులకు ఇకపై రోజుకు 100 వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను TTD కేటాయించనుంది. అలాగే శ్రీవారి దర్శనం కోసం వచ్చే NRIలు, విదేశీయులకు సుపథం మార్గంలో రూ.300 కోటాలో దర్శనం కల్పించనుంది. స్టాంపింగ్ తేదీ నుంచి నెలలోపు దర్శనం కల్పించనుంది. ఒరిజినల్ పాస్‌పోర్టుతో ఉ.10 నుంచి సా.5 గంటలోపు వచ్చిన వారికి టోకెన్లు ఇస్తారు. బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల టైంలో టోకెన్లు ఇవ్వరు.