News January 7, 2025

ఎస్సీ వర్గీకరణ, కుల సర్వేపై అభ్యంతరాల గడువు పెంపు

image

AP: ఎస్సీ వర్గీకరణ, కుల సర్వేపై అభ్యంతరాల సమర్పణ గడువును ఈ నెల 12 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన గడువు ఇవాళ్టితో ముగియనుండటంతో మరో 5 రోజులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటివరకు గ్రామ/వార్డు సచివాలయాల్లో సర్వే వివరాలు ప్రచురించి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అభ్యంతరాల అనంతరం ఈ నెల 20వ తేదీన తుది జాబితాను ప్రకటించనున్నారు.

Similar News

News December 15, 2025

విజయ్ హజారే ట్రోఫీ అందరూ ఆడాల్సిందే: BCCI

image

డిసెంబరు 24 నుంచి ప్రారంభంకానున్న విజయ్ హజారే ట్రోఫీలో జాతీయ జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ తప్పనిసరిగా పాల్గొనాలని BCCI స్పష్టం చేసింది. కనీసం రెండు మ్యాచ్‌లు ఆడాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం కోహ్లీ, రోహిత్‌లకి మాత్రమే కాకుండా అందరికీ వర్తిస్తుందని తెలిపింది. దేశవాళీ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. గాయాలతో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్‌కు మినహాయింపు ఉంది.

News December 15, 2025

హిమాలయాల్లో అణు పరికరం.. పొంచి ఉన్న ప్రమాదం!

image

1965లో చైనా అణు కార్యక్రమంపై నిఘా కోసం అమెరికా CIA భారత్‌తో కలిసి హిమాలయాల్లోని నందాదేవి శిఖరంపై అణుశక్తితో పనిచేసే నిఘా పరికరం ఏర్పాటుచేయాలని భావించింది. మంచు తుఫానుతో ప్లుటోనియం ఉన్న పరికరాన్ని అక్కడే వదిలేశారు. తర్వాత వెళ్లి వెతికినా అది కనిపించలేదు. హిమానీనదాలు కరిగి ఆ పరికరం దెబ్బతింటే నదులు కలుషితం అవ్వొచ్చని సైంటిస్టులు తెలిపారు. తాజాగా బీజేపీ MP నిశికాంత్ ట్వీట్‌తో ఈ వార్త వైరలవుతోంది.

News December 15, 2025

రేపు ఉదయం దట్టమైన పొగమంచు.. జాగ్రత్త

image

తెలంగాణలో రేపు దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ముఖ్యంగా దక్షిణ, తూర్పు, సెంట్రల్ తెలంగాణ జిల్లాల ప్రజలు రేపు ఉదయం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. హైవేలపై ప్రయాణం చేసే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని, వీలైతే బయటకు వెళ్లొద్దని సూచించారు. అలాగే కోల్డ్ వేవ్ కండిషన్లు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
Share it