News April 29, 2024
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

AP: రాష్ట్రంలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 25 లోక్‌సభ స్థానాలకు 503 మంది, 175 అసెంబ్లీ సీట్లకు 2,705 మంది పోటీలో ఉన్నారు. నంద్యాల పార్లమెంట్‌కు అత్యధికంగా 36 నామినేషన్లు, రాజమండ్రి ఎంపీ స్థానానికి అత్యల్పంగా 12 నామినేషన్లు దాఖలయ్యాయి. తిరుపతి అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 48 నామినేషన్లు, చోడవరం ఎమ్మెల్యే స్థానానికి అత్యల్పంగా 6 నామినేషన్లు దాఖలయ్యాయి.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News April 14, 2026
నేను రఫ్ డాడీని: రామ్ చరణ్

పిల్లలే తన ప్రాణమని, వాళ్లు లేకపోతే ఇల్లు బోసిపోయినట్లు ఉంటుందని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. ‘నేను రఫ్ డాడీని. పిల్లల్ని గంతులేయనివ్వడం, ఎక్కనివ్వడం, రిస్క్ తీసుకోనివ్వడం వంటివి చేస్తాను. వారితో సమయం గడిపే తండ్రిగా ఉండాలనుకుంటా. నా ప్రపంచాన్ని కాస్త చిన్నదిగా, పరిమితంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తా’ అని Esquire India ఇంటర్వ్యూలో చెప్పారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
News April 14, 2026
కూరగాయల పంటల్లో వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు

వైరస్ తెగుళ్ల కట్టడికి రసం పీల్చే పురుగులను నివారించడం ముఖ్యం. అలాగే రైతులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వైరస్ తెగుళ్లను తట్టుకునే రకాల ఎంపిక, పంట మార్పిడి, అంతర పంటలను సాగు చేయాలి. పంట పొలం చుట్టూ జొన్న లేదా మొక్కజొన్న పంటలను కంచె పంటగా సాగు చేయాలి. కలుపు మొక్కలను తొలగించాలి. విత్తనం నాటే ముందు పొలానికి ట్రైకోడెర్మా, వేపపిండి కలిపి వేయడం, గుళికలమందు వాడకం, విత్తనశుద్ధి మంచి ఫలితాలిస్తాయి.
News April 14, 2026
గొర్రె పిల్లలకు ఎలాంటి ఆహారం ఇస్తే మంచిది?

గొర్రె పిల్లలకు పుట్టిన మొదటి రోజు నుంచి 20 వారాల వయసు వచ్చేవరకు వివిధ దశలలో సరిపడేంతగా పాలను, క్రీపు దాణాను, T.M.R(టోటల్ మిక్స్‌డ్ రేషన్)ను నిర్దేశిత పరిమాణంలో అందించాలి. వీటిని సరైన పరిమాణంలో అందిస్తే 5 లేదా 6 నెలల వయసులోనే గొర్రె పిల్లలు 28 నుంచి 30 కిలోల బరువు పెరుగుతాయి. దీని వల్ల త్వరగా వీటిని కోతకు అమ్మి మంచి ఆదాయం పొందవచ్చు. అలాగే వాటి మరణాల శాతాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చు.


