News September 10, 2024

వియత్నాంలో 87కు చేరిన మరణాలు

image

వియత్నాంను యాగీ తుఫాను వణికించింది. ఇప్పటివరకు పలు ఘటనల్లో చనిపోయిన వారి సంఖ్య 87కి చేరింది. మరో 70 మంది గల్లంతయ్యారు. సుమారు 700 మందికిపైగా గాయపడినట్లు నివేదికలు పేర్కొన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గంటకు 149 కి.మీ.ల వేగంతో గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు. తుఫాను ధాటికి కొండచరియలు విరిగిపడగా, భారీ ఎత్తున వరదలు సంభవించాయి. అనేక ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ దెబ్బతింది.

Similar News

News October 7, 2024

నోర్మూసుకుని కూర్చో: కమెడియన్‌తో ఓలా సీఈఓ

image

ఓలా బైక్స్‌ను విమర్శిస్తూ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన ట్వీట్‌పై ఆ సంస్థ సీఈఓ భవీశ్ అగర్వాల్ మండిపడ్డారు. అంత బాధగా ఉంటే వచ్చి హెల్ప్ చేయాలని సూచించారు. ‘వచ్చి మాకు సాయం చేయండి. మీ పెయిడ్ ట్వీట్ లేదా మీ విఫల కెరీర్ వల్ల మీకొచ్చేదాని కంటే ఎక్కువ జీతం ఇస్తా. లేదంటే నోర్మూసుకుని కూర్చోండి. నిజమైన వినియోగదారుల కోసం సమస్యల్ని సరిచేయనివ్వండి. మా సేవల్ని మరింత విస్తరిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

News October 7, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 7, 2024

ప్రముఖుల సమాధులన్నీ FTL పరిధిలోనే: ఒవైసీ

image

TG: హైడ్రా కూల్చివేతలపై 2013లో కాంగ్రెస్ తెచ్చిన భూచట్టం ప్రకారమే ముందుకెళ్లాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సూచించారు. బాపూఘాట్‌తో సహా ప్రముఖుల సమాధులన్నీ FTL పరిధిలోనే ఉన్నాయన్నారు. తెలంగాణ సచివాలయం కూడా ఆ పరిధిలోనే ఉందని చెప్పారు. పేదల ఇళ్ల కూల్చివేతపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. ముందుగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.