News June 20, 2024
వడదెబ్బ మరణాలు.. ఆరోగ్యశాఖ అప్రమత్తం

దేశంలో వడదెబ్బ కేసులు, మరణాలు ఎక్కువవుతున్న తరుణంలో కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి JP నడ్డా తెలిపారు. వడదెబ్బకు గురైన వారికి అందించే చికిత్స, ప్రత్యేక ఏర్పాట్లను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు రావొద్దని, ద్రవాహారం అధికంగా తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
Similar News
News July 8, 2025
తెలుగుజాతి నంబర్ వన్ కావడమే లక్ష్యం: CBN

AP: తెలుగు రాష్ట్రాల జల వివాదంపై CM చంద్రబాబు మరోసారి స్పందించారు. సముద్రంలోకి వృథాగా వెళ్లే నీటిని సద్వినియోగం చేసుకుంటే రెండు రాష్ట్రాలు బాగుపడతాయన్నారు. తెలుగుజాతి ప్రపంచంలోనే నంబర్ వన్ కావడం తన లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఆ తప్పులు సరిచేసేందుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నానని, 24 గంటలు సరిపోవడం లేదని వ్యాఖ్యానించారు.
News July 8, 2025
జలాలే మన సంపద, వాటితోనే కష్టాలు తీరుతాయి: CBN

AP: ఇవాళ తన జీవితంలో సంతోషకరమైన రోజని CM చంద్రబాబు అన్నారు. జులై తొలి వారంలోనే శ్రీశైలం ప్రాజెక్ట్ నిండటం శుభపరిణామం అని చెప్పారు. జలాలే మన సంపద అని, వాటితోనే రైతుల కష్టాలు తీరుతాయని వ్యాఖ్యానించారు. ‘నీటి కరవు ఉన్న రాయలసీమను ఎవరూ కాపాడలేరని చాలామంది అన్నారు. కానీ ఆ ప్రాంత స్థితిగతులు మార్చేందుకు NTR నడుం బిగించారు. ఇప్పుడు రాయలసీమ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తున్నా’ అని వెల్లడించారు.
News July 8, 2025
జైలులో కాకాణికి తోడుగా ఉంటా: ప్రసన్న కుమార్ రెడ్డి

AP: TDP MLA <<16988626>>వేమిరెడ్డి ప్రశాంతి<<>>పై చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని YCP నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ‘ప్రశాంతి నాపై కేసులు పెట్టినా, కోర్టుకు వెళ్లినా ఫర్వాలేదు. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినా అభ్యంతరం లేదు. నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపితే కాకాణి గోవర్ధన్ రెడ్డికి తోడుగా ఉంటా’ అని ఆయన వ్యాఖ్యానించారు.