News July 3, 2024
121కి చేరిన మరణాలు.. భోలే బాబా పరార్

యూపీలోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 121కి చేరింది. నిన్న 116 మంది మరణించగా చికిత్స పొందుతూ ఈరోజు మరో ఐదుగురు ప్రాణాలు విడిచారు. ఇదిలా ఉంటే అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేసిన భోలే బాబా పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. బాబాకు సంబంధించిన రామ్ కుటీర్ ఛారిటబుల్ ట్రస్టులో వెతికినా ఆయన కనిపించలేదని తెలిపారు.
Similar News
News January 4, 2026
VKB: 4 మున్సిపాలిటీలు.. 1,74,509 మంది ఓటర్లు

వికారాబాద్ జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో 1,74,509 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ఓటర్ జాబితా విడుదల చేశారు. వికారాబాద్ మున్సిపల్లో 58,117 ఓటర్లలో మహిళలు 29,339, పురుషులు 28,751 మంది ఉన్నారు. తాండూర్ 77,110 ఓటర్లకు మహిళలు 39,558, పురుషులు 37,547 మంది ఉన్నారు. పరిగి 27,614లో మహిళలు 13,792, పురుష ఓటర్లు 13,822 మంది ఉన్నారు. కొడంగల్ 11,668 మంది ఓటర్లకు మహిళలు 6,007, పురుషులు 5,661 మంది ఉన్నారు.
News January 4, 2026
2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ సిద్ధం: మోదీ

2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధమవుతోందని ప్రధాని మోదీ ప్రకటించారు. పదేళ్లలో ఫిఫా అండర్-17, హాకీ ప్రపంచ కప్ వంటి 20కి పైగా అంతర్జాతీయ ఈవెంట్లను విజయవంతంగా నిర్వహించామని గుర్తుచేశారు. క్రీడారంగంలో భారత్ సాధిస్తున్న పురోగతిని వివరిస్తూ.. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణతో పాటు, ఒలింపిక్స్‌ను నిర్వహించడమే లక్ష్యమని 72వ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవం సందర్భంగా తెలిపారు.
News January 4, 2026
చంద్రబాబు స్వార్థ రాజకీయాలతో రాయలసీమకు అన్యాయం: అంబటి

AP: TG CM రేవంత్‌రెడ్డితో చంద్రబాబు కుదుర్చుకున్న రహస్య ఒప్పందాలు రాయలసీమకు మరణశాసనంగా మారాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. స్వార్థం కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకున్నారన్నారు. గతంలో ఆల్మట్టి, పోలవరం, ప్రత్యేక హోదా విషయంలోనూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని పేర్కొన్నారు. అధికారం కోసం AP ప్రయోజనాలను పక్కనపెట్టి రాష్ట్రాన్ని చంద్రబాబు దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు.


