News March 18, 2025

నేడు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ

image

TG: ఇవాళ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరగనుంది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నట్లు సమాచారం. నిన్న ఈ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ సభలో ప్రవేశపెట్టారు. దీంతో పాటు యాదాద్రి బోర్డు ఏర్పాటుపై బిల్లు, అడ్వకేట్ వెల్ఫేర్, అడ్వకేట్ క్లర్క్ వెల్ఫేర్ ఫండ్, మున్సిపాలిటీల సవరణ బిల్లు, పంచాయతీ రాజ్ సవరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

Similar News

News November 11, 2025

శుభ సమయం (11-11-2025) మంగళవారం

image

✒ తిథి: బహుళ షష్ఠి ఉ.6.10 వరకు
✒ నక్షత్రం: పుష్యమి రా.12.55 వరకు
✒ శుభ సమయాలు: సా.5.30-సా.6.30
✒ రాహుకాలం: మ.3.00-సా.4.30
✒ యమగండం: ఉ.9.00-ఉ.10.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, రా.10.48-రా.11.36
✒ వర్జ్యం: ఉ.8.38-ఉ.10.09
✒ అమృత ఘడియలు: రా.10.13-రా.11.45

News November 11, 2025

TODAY HEADLINES

image

➤ ఢిల్లీలో పేలుడు.. 13 మంది మృతి, దేశవ్యాప్తంగా హైఅలర్ట్
➤ పేలుడుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం: అమిత్ షా
➤ రచయిత అందెశ్రీ కన్నుమూత.. రేపు అంత్యక్రియలు
➤ స్పీకర్‌పై సుప్రీంకోర్టులో BRS కోర్టు ధిక్కార పిటిషన్
➤ రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఏపీ క్యాబినెట్ ఆమోదం
➤ వైసీపీ హయాంలో తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపినట్లు CBI సిట్ తేల్చింది: TDP

News November 11, 2025

జంక్ ఫుడ్ తింటున్నారా?

image

అల్ట్రా-ప్రాసెస్డ్ జంక్ ఫుడ్ (కూల్ డ్రింక్స్, చిప్స్, ప్యాకేజ్డ్ మాంసం) కేవలం బరువు పెంచడమే కాకుండా మెదడుకు తీవ్ర హాని కలిగిస్తుందని హెల్సింకి యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. జంక్ ఫుడ్ ఎక్కువగా తినే 30 వేల మంది బ్రెయిన్స్ స్కాన్ చేయగా సెల్స్ డ్యామేజ్ & వాపు వంటి మార్పులు కనిపించాయి. ఇవి మెదడును తిరిగి ప్రోగ్రామింగ్ చేసి, అదే చెత్త ఆహారాన్ని పదేపదే కోరుకునేలా చేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.