News September 12, 2025
అప్పులు ఆంధ్రాలో మాత్రమే పెరగలేదు: బుగ్గన

ఆంధ్రప్రదేశ్‌లో అప్పులు పెరిగాయని జనరలైజ్డ్‌గా మాట్లాడటం సరికాదని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. గడచిన పదేళ్లలో కేంద్రం సహా చాలా రాష్ట్రాల్లో అప్పులు పెరిగాయని Way2News కాన్‌క్లేవ్‌లో వెల్లడించారు. అప్పటి కరోనా సహా ఇతర పరిస్థితులతో సరైన ఉపాధి, ఆదాయ అవకాశాలు లేవని తెలిపారు. ఇక విభజన తర్వాత చాలా కీలకమైన మొదటి 5 సంవత్సరాలు ఏ పనినీ సరిగా చేయలేకపోయారని ఆరోపించారు.
Similar News
News September 12, 2025
రైతులతో మాట్లాడుతూ రాజధానిని విస్తరిస్తాం: చంద్రబాబు

AP: అమరావతి రెండో విడత భూసేకరణపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 33వేల ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. వారిని ఆదుకుంటాం. విమానాశ్రయం, పెద్దపెద్ద సంస్థలు రావాలి. నేను ఇక్కడే ఆగిపోతే అభివృద్ధి నిలిచిపోతుంది. భవిష్యత్తులో పెద్ద ప్రాజెక్టులు కావాలంటే ఇంకా ల్యాండ్ కావాలి. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ రాజధానిని విస్తరిస్తాం’ అని వే2న్యూస్ కాన్‌క్లేవ్‌లో చెప్పారు.
News September 12, 2025
బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్షాలు

AP: పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు APSDMA తెలిపింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో ఇది కేంద్రీకృతమైందని పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో 3 రోజుల పాటు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News September 12, 2025
ప్రైవేట్ రంగంలో శాటిలైట్స్ తయారు చేస్తాం: సీఎం

AP: ప్రపంచంలో తెలుగు జాతి నం.1గా ఉండాలనేది తన ఆకాంక్ష అని, అందుకోసం పని చేస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘ఒకటిన్నరేళ్లలో రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో శాటిలైట్స్ తయారు చేస్తాం. ఇందుకోసం స్పేస్ సిటీని తీసుకొస్తున్నాం. ఓర్వకల్లులో డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం. లేపాక్షి దగ్గర బిగ్ ఎలక్ట్రానిక్ సిటీ తయారు చేస్తాం’ అని Way2News కాన్‌క్లేవ్‌లో వివరించారు.