News June 4, 2024
దశాబ్దాల నిరీక్షణ.. మంగళగిరిలో టీడీపీ జెండా రెపరెపలు!
AP: గుంటూరు(D) మంగళగిరిలో TDP అభ్యర్థి నారా లోకేశ్ రికార్డు సృష్టించనున్నారు. ఎన్నికల కౌంటింగ్‌లో 15 వేలకు పైగా మెజార్టీలో కొనసాగుతూ గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. దశాబ్దాలుగా ఇక్కడ టీడీపీ జెండా ఎగురలేదు. 15 సార్లు ఎన్నికలు జరిగితే ఇక్కడ టీడీపీ గెలిచింది రెండు సార్లే. చివరిసారిగా 1985లో ఇక్కడ గెలిచింది. నారా లోకేశ్ గెలుపుతో టీడీపీకి కొరకరాని కొయ్యగా ఉన్న ఈ నియోజకవర్గం ఆ పార్టీ ఖాతాలో చేరనుంది.
Similar News
News November 4, 2024
అన్నపూర్ణ స్టూడియోలోనే చైతూ-శోభిత పెళ్లి?
అక్కినేని నాగ చైతన్య-శోభితల పెళ్లి పనులు మొదలవడంతో వెడ్డింగ్ వేదిక ఎక్కడనే చర్చ మొదలైంది. డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందని వార్తలు రాగా అందుకు భిన్నంగా HYD అన్నపూర్ణ స్టూడియోలోనే ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే సెట్టింగ్, డెకరేషన్ పనులు మొదలైనట్లు తెలుస్తోంది. ఇరు ఫ్యామిలీలు పెళ్లి పిలుపులను ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా డిసెంబర్ 4న వీరి వివాహం జరుగుతుందని టాక్.
News November 4, 2024
SUPER: క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ‘చరిత్ర’ తెలుస్తుంది!
చారిత్రక కట్టడాల వివరాలు ప్రజలకు తెలిసేలా కేంద్ర పురావస్తుశాఖ ఆయా నిర్మాణాల వద్ద క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేస్తోంది. వరంగల్(D) ఖిలా వరంగల్‌లోనూ వీటిని అందుబాటులోకి తెచ్చింది. ఈ కోడ్‌ను ఫోన్‌లో స్కాన్ చేస్తే తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో కాకతీయుల చరిత్ర, ఆలయాల విశేషాలు, పురాతన కట్టడాల గురించి చూపిస్తుంది. జిల్లాల పర్యాటక ప్రాంతాల వివరాలు, గూగుల్ మ్యాప్ లొకేషన్ వంటివి తెలుసుకునే వెసులుబాటు కల్పించింది.
News November 4, 2024
Be Ready: నవంబర్‌లో 4 అద్భుతాలు
ఈనెలలో 4 అద్భుతాలు స్పేస్ లవర్స్‌కు కనువిందు చేయనున్నాయి. అందులో ఒకటి.. భూమి నుంచి నేరుగా చూడగల నక్షత్రాల్లో ఒకటైన స్పైకా ఈ నెల 27న గంటపాటు మాయం కానుంది. ఆరోజు చందమామ ఈ తెలుపు, నీలి కాంతుల తారకు తెరగా అడ్డు వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. తూర్పు అమెరికా, కెనడాలో ఈ వండర్ వీక్షించవచ్చు. ఇక మరో 3.. అంగారక, గురు, శని గ్రహాలు ఈ మాసంలో భూమికి చేరువగా రానుండగా, రాత్రుళ్లు వీటిని నేరుగానే చూడవచ్చట.