News December 1, 2024

డిసెంబర్ 1: చరిత్రలో ఈ రోజు

image

1963: భారతదేశంలో 16వ రాష్ట్రంగా నాగాలాండ్ అవతరణ
1954: ఉద్యమకారిణి మేధా పాట్కర్ జననం
1955: గాయకుడు ఉదిత్ నారాయణ్ జననం
1980: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ జననం
1995: మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి మరణం
2003: ప్రపంచ ఎయిడ్స్ దినం
సరిహద్దు భద్రతా దళ (BSF) ఏర్పాటు

Similar News

News December 1, 2024

రాష్ట్రంలో మళ్లీ VRO వ్యవస్థ?

image

TG: రాష్ట్రంలో మళ్లీ వీఆర్వో వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన VROలకు నేరుగా బాధ్యతలు అప్పగించి, మిగతా వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించి తీసుకోనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3 వేల మంది VROలు ఉండగా, మరో 8 వేల మందిని రాత పరీక్ష ఆధారంగా నియమిస్తారని సమాచారం. 10,909 రెవెన్యూ గ్రామాలకు VROలను నియమిస్తారని తెలుస్తోంది.

News December 1, 2024

నేడైనా ప్రాక్టీస్ కొనసాగేనా?

image

ప్రైమ్ మినిస్టర్ XIతో భారత్ ఆడాల్సిన 2 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌కు తొలి రోజు వర్షం అంతరాయం కలిగించడంతో టాస్ కూడా పడలేదు. దీంతో అంపైర్లు తొలి రోజు ఆట రద్దు చేశారు. ఇవాళ టెస్టు ఫార్మాట్‌లో కాకుండా వైట్ బాల్ ఫార్మాట్‌లో 50 ఓవర్ల చొప్పున ఆడే అవకాశం ఉంది. కాగా ఈ నెల 6 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ టెస్టులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఆడతారని సమాచారం.

News December 1, 2024

మామయ్య అస్థిపంజరమే అతడి గిటార్‌!

image

గ్రీస్‌కు చెందిన యూట్యూబర్ ప్రిన్స్ మిడ్‌నైట్ గిటార్ అద్భుతంగా ప్లే చేస్తాడు. కానీ ఆ గిటార్ అతడి మామయ్య ఫిలిప్ అస్థిపంజరం నుంచి తయారుచేసుకున్నాడు. ‘20 ఏళ్ల క్రితం మామయ్య చనిపోయినప్పుడు ఆయన కోరిక ప్రకారం శరీరాన్ని మెడికల్ స్కూల్‌కి ఇచ్చేశాం. అస్థిపంజరాన్ని వాళ్లు ఈమధ్య తిరిగిచ్చేశారు. ఏం చేయాలో తెలియలేదు. గిటార్‌గా మారిస్తే ఆయన నాతోనే ఉన్నట్లు ఉంటుందనిపించి ఇలా చేశాను’ అని ప్రిన్స్ తెలిపారు.