News December 18, 2024
డిసెంబర్ 18: చరిత్రలో ఈరోజు

1937: నటుడు కాకరాల సత్యనారాయణ జననం
1946: హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బెర్గ్ జననం (ఫొటోలో)
1952: స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత గరిమెళ్ళ సత్యనారాయణ మరణం
1970: సినీ నిర్మాత దిల్ రాజు జననం
1985: నటి స్నేహా ఉల్లాల్ జననం
2000: సినీ గాయకుడు మాధవపెద్ది సత్యం మరణం
2012: భారత మాజీ వాలీబాల్ ప్లేయర్ తిలకం గోపాల్ మరణం
Similar News
News November 15, 2025
పర్స్ అమౌంట్.. ఏ జట్టు దగ్గర ఎంత ఉందంటే?

వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఆటగాళ్ల <<18297320>>రిటెన్షన్, రిలీజ్<<>> ప్రక్రియ పూర్తయ్యింది. త్వరలో జరిగే మినీ వేలం కోసం KKR వద్ద అత్యధికంగా రూ.64.3 కోట్లు, అత్యల్పంగా MI వద్ద రూ.2.75 కోట్ల పర్స్ అమౌంట్ మాత్రమే ఉంది. ఇక CSK(రూ.43.4 కోట్లు), SRH(రూ.25.5 కోట్లు), LSG(రూ.22.9 కోట్లు), DC(రూ.21.8 కోట్లు), RCB(రూ.16.4 కోట్లు), RR(రూ.16.05 కోట్లు), GT(రూ.12.9 కోట్లు), PBKS(రూ.11.5 కోట్లు) అమౌంట్ కలిగి ఉంది.
News November 15, 2025
శ్రీకాకుళం జిల్లాకు కొత్త ఎయిర్‌పోర్టు

AP: ఉత్తరాంధ్రకు మరో ఎయిర్ పోర్టు రానుంది. శ్రీకాకుళం జిల్లాలో నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య MOU కుదిరింది. CM CBN, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో ఒప్పందం జరిగింది. ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో ఈ ప్రాంత అభివృద్ధికి ఊతం లభిస్తుందని CM తెలిపారు. పర్యాటకరంగం వృద్ధి చెందుతుందన్నారు.
News November 15, 2025
ఇతిహాసాలు క్విజ్ – 67 సమాధానాలు

ప్రశ్న: శ్రీమహావిష్ణువుపై అలిగి లక్ష్మీదేవి భూమి మీదకు రావడానికి గల ముఖ్య కారణం ఏంటి?
జవాబు: విష్ణుమూర్తి శేషతల్పంపై శయనించి ఉండగా, భృగు మహర్షి ఆయన వక్షస్థలంపై కాలితో తన్నారు. అప్పుడు విష్ణువు ఏమాత్రం కోప్పడకుండా మహర్షి పాదాలకు క్షమాపణ చెప్పారు. తన నివాస స్థలమైన వక్షస్థలాన్ని ఒకరు కాలితో తన్నినా, విష్ణుమూర్తి అతడిని శిక్షించకపోవడంతో అలిగిన లక్ష్మీదేవి కోపంతో భూమ్మీదకు వచ్చింది.
<<-se>>#Ithihasaluquiz<<>>


