News December 18, 2024
డిసెంబర్ 18: చరిత్రలో ఈరోజు

1937: నటుడు కాకరాల సత్యనారాయణ జననం
1946: హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బెర్గ్ జననం (ఫొటోలో)
1952: స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత గరిమెళ్ళ సత్యనారాయణ మరణం
1970: సినీ నిర్మాత దిల్ రాజు జననం
1985: నటి స్నేహా ఉల్లాల్ జననం
2000: సినీ గాయకుడు మాధవపెద్ది సత్యం మరణం
2012: భారత మాజీ వాలీబాల్ ప్లేయర్ తిలకం గోపాల్ మరణం
Similar News
News July 9, 2025
కృష్ణమ్మలో గోదావరి జలాలు.. మంత్రి పూజలు

AP: పట్టిసీమ నుంచి విడుదల చేసిన గోదావరి జలాలు కృష్ణమ్మలో కలిశాయి. విజయవాడ ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద పవిత్ర సంగమంలో మంత్రి నిమ్మల రామానాయుడు గోదావరి జలాలకు జలహారతి ఇచ్చారు. రూ.1,300 కోట్లతో పట్టిసీమ నిర్మిస్తే ఇప్పటివరకు 428 TMCలకు పైగా కృష్ణాకు తరలించామని తెలిపారు. చంద్రబాబు ముందుచూపు వల్లే గోదావరి జలాలతో కృష్ణా డెల్టాలో పంటలు పండుతున్నాయని, ఆయన ముందుచూపుకు ఈ ప్రాజెక్టే ఒక ఉదాహరణ అని అన్నారు.
News July 9, 2025
ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్, ఫోన్ సీజ్ చేసిన సిట్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్, ఫోన్‌ను సిట్ అధికారులు సీజ్ చేశారు. డేటా విశ్లేషణ కోసం FSLకు పంపించారు. ఇప్పటికే నిందితులు, బాధితుల స్టేట్‌మెంట్‌ను రికార్డును చేశారు. 2023 నవంబర్ 15-30 వరకు సర్వీస్ ప్రొవైడర్ డేటాలోని ఫోన్ నంబర్లు, డేటా రిట్రైవ్, హార్డ్ డిస్క్‌లోని రహస్యాలపై సిట్ ఆరా తీసింది. రేపు ప్రభాకర్ రావును సిట్ మరోసారి విచారించనుంది.
News July 9, 2025
నెలకు రూ.1.23 లక్షల జీతం.. నోటిఫికేషన్ విడుదల

170 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 21-25 ఏళ్ల వయసు ఉండి డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్/12వ తరగతిలో కచ్చితంగా మ్యాథ్స్, ఫిజిక్స్ చదవి ఉండాలి. చివరి తేదీ జులై 23. రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం పోస్టులను బట్టి నెలకు రూ.56,100 నుంచి రూ.1.23లక్షల వరకు ఉంది. https://joinindiancoastguard.cdac.in/