News December 28, 2024

డిసెంబర్ 28: చరిత్రలో ఈరోజు

image

✒ 1859: IPC సృష్టికర్త లార్డ్ మెకాలే మరణం
✒ 1885: ఉమేశ్ చంద్ర బెనర్జీ అధ్యక్షతన INC స్థాపన
✒ 1921: కలకత్తా INC సభల్లో తొలిసారి వందేమాతర గీతాలాపన
✒ 1932: రిలయన్స్ ఫౌండర్ ధీరూభాయ్ అంబానీ జననం
✒ 1932: మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ జననం
✒ 1937: పారిశ్రామికవేత్త రతన్ టాటా జననం
✒ 1952: కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ జననం
✒ 2023: ప్రముఖ నటుడు విజయకాంత్ మరణం

Similar News

News April 18, 2026

‘మే’లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు?

image

తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి మొదలు కానుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ కోసం ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నెల 23లోపు ముసాయిదా జాబితా సిద్ధం చేసి అనంతరం విడుదల చేయనుంది. దీంతో వచ్చే నెలలో ఎలక్షన్స్ జరిగే అవకాశం కనిపిస్తోంది. కాగా గతేడాది జూన్‌తో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. ఇక రాష్ట్రంలో ఇటీవల సర్పంచ్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

News April 18, 2026

సోమవారం రెండో విడత శాంతి చర్చలు!

image

అమెరికా-ఇరాన్ రెండో విడత శాంతి చర్చలకు సిద్ధమయ్యాయి. అందుకు మరోసారి పాకిస్థాన్‌ను వేదికగా ఎంచుకున్నాయి. ఇస్లామాబాద్‌లో వచ్చే సోమవారం చర్చలు జరపనున్నట్లు సమాచారం. రేపు ఇరాన్ ప్రతినిధులు పాక్ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తొలి విడత చర్చలు విఫలమైన విషయం తెలిసిందే.

News April 18, 2026

పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.810 పెరిగి రూ.1,55,780కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.750 పెరిగి రూ.1,42,800గా ఉంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.5000 ఎగసి రూ.2,80,000కి చేరింది.