News September 29, 2024

అక్టోబర్ 1న DEECET సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

TG: రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి అక్టోబర్ 1న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. క్వాలిఫై అయిన వారు సంబంధిత జిల్లాల్లోని డైట్ కాలేజీల్లో వెరిఫికేషన్ చేయించుకోవాలి. మరిన్ని వివరాలకు https://deecet.cdse.telangana.gov.inను చూడండి.

Similar News

News October 12, 2024

లుంగీలు, దుప్పట్ల సాయంతో జైలు నుంచి జంప్!

image

అస్సాంలోని మోరిగావ్ జిల్లా జైలు నుంచి శుక్రవారం రాత్రి ఐదుగురు ఖైదీలు పరారయ్యారు. లుంగీలు, దుప్పట్లను తాడులా చేసి 20 అడుగుల జైలు గోడను దూకేశారు. ఖైదీలు సైఫుద్దీన్, జియారుల్ ఇస్లాం, నూర్ ఇస్లాం, మఫీదుల్, అబ్దుల్ రషీద్ పోక్సో కేసుల్లో నేరస్థులని, వారి కోసం జిల్లావ్యాప్తంగా జల్లెడ పడుతున్నామని పోలీసులు వెల్లడించారు. ఖైదీలకు ఎవరైనా సాయం చేశారా అనే కోణంలోనూ విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.

News October 12, 2024

అమ్మవారికి తల సమర్పించేందుకు భక్తుడి యత్నం!

image

దుర్గమ్మకు ఓ భక్తుడు ఏకంగా తలనే సమర్పించాలనుకున్న ఘటన ఇది. మధ్యప్రదేశ్‌లోని ‘మా బీజాసన్’ గుడికి శుక్రవారం వచ్చిన భక్తుడు తన తలను సమర్పించాలని యత్నించాడు. రేజర్‌తో మెడ కోసుకుంటుండగా ఇతర భక్తులు అడ్డుకున్నారు. అప్పటికే లోతుగా తెగిపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సర్జరీ అనంతరం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. 9 రోజుల పాటు ఉపవాసం ఉండి తల ఇచ్చేందుకు ఆలయానికి వచ్చాడని పోలీసులు తెలిపారు.

News October 12, 2024

WOW: కుర్రాడిలా మారిపోయిన ధోనీ!

image

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఎప్పటికప్పుడు కొత్త లుక్స్ ట్రై చేస్తుంటారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో జులపాల జట్టుతో తన కెరీర్ ఆరంభంలో ఉన్నట్లుగా కనిపించారు. తాజాగా హెయిర్ కట్ చేయించి మరింత కుర్రాడిలా మారిపోయారు. సీఎస్కే టీమ్ ట్విటర్‌లో ఆ లుక్స్ పంచుకుని ‘ఎక్స్‌ట్రీమ్ కూల్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 43 ఏళ్ల ధోనీ ఆ పిక్స్‌లో నవ యువకుడిలా కనిపిస్తుండటం విశేషం.