News November 1, 2024

కూతురు పేరు వెల్లడించిన దీపికా పదుకొణె

image

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తన కుమార్తె పేరును వెల్లడించారు. ఆమెకు ‘దువా పదుకొణె సింగ్’ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. దువా అంటే ప్రార్థన అని, మా ప్రార్థనలకు ఆమె సమాధానం’ అని దీపిక సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. కాగా 38 ఏళ్ల దీపిక.. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను 2018లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ సెప్టెంబర్‌లో పాప జన్మించింది.

Similar News

News December 9, 2025

స్టార్ బ్యాటర్ అంజుమ్ చోప్రా గురించి తెలుసా?

image

ప్రస్తుతం స్పోర్ట్స్ యాంకర్‌గా ఉన్న అంజుమ్ చోప్రా గతంలో భారత జట్టులో కీలకపాత్ర పోషించారు. 18 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన ఈ దిల్లీ క్రికెటర్‌ IND తరఫున 100 వన్డేలు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించారు. స్టార్ బ్యాటర్ అయిన ఆమె నాలుగు ప్రపంచ కప్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. మొత్తం మీద 127 వన్డేలు, 12 టెస్టులు, 18 టీ20లు ఆడారు. 2007లో అర్జున అవార్డు, 2014 పద్మశ్రీ అందుకున్నారు.

News December 9, 2025

పూజాగదిలో తప్పనిసరిగా నీళ్లు ఎందుకు ఉండాలి?

image

పూజా గదిలో ఏదైనా ఓ పాత్రలో నీటిని తప్పక ఉంచాలని పండితులు సూచిస్తారు. తద్వారా దేవతలు సంతృప్తి చెందుతారని అంటారు. ‘మహా నైవేద్యం కంటే కూడా నీటిని ఉంచి ప్రార్థించడం ద్వారా దేవతలు ఎక్కువ సంతోషిస్తారు. రాగి చెంబులో ఉంచిన మంచి నీరు మంత్ర శక్తి చేరిన జలంతో సమానం. ఆ నీరు ఆరోగ్యం, ఆనందాన్ని ఇస్తుంది. ఈ నీటిని రెండ్రోజులకోసారి మార్చాలి. ఫలితంగా ఇంట్లో రుణ శక్తి దూరమై, దైవశక్తి పెరుగుతుంది’ అని చెబుతున్నారు.

News December 9, 2025

ఘోరం: భార్య మగ పిల్లాడిని కనలేదని..

image

టెక్నాలజీ ఎంత పెరిగినా కొందరిలో మూఢనమ్మకాలు పోవట్లేదు. కర్ణాటక విజయపుర(D)లో భార్య ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చిందని ఆమెకు శిరోముండనం చేసి వెంట్రుకలను శ్మశానంలో కాల్చేశాడో భర్త. బ్లేడుతో కట్ చేయడంతో ఆమె తలకు గాయాలయ్యాయి. భార్యలో దెయ్యం ఉందని, అందుకే మగ పిల్లాడు పుట్టలేదని ఓ మంత్రగాడు చెప్పిన మాటలు నమ్మి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి భర్త డుండేశ్‌ను అరెస్టు చేశారు.