News September 1, 2024

దీపికా పదుకొణె తల్లి కాబోయేది ఆరోజే?

image

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె డెలివరీ డేట్ ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఈనెల 28న ఆమె తన మొదటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సమాచారం. ముంబైలోని ఓ ఆస్పత్రిలో ఆమె ప్రసవించనున్నట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె దంపతులకు 2018, నవంబర్‌లో వివాహమైన సంగతి తెలిసిందే.

Similar News

News September 13, 2024

మధ్యాహ్న భోజనంలో ఊసరవెల్లి.. 65మంది పిల్లలకు అస్వస్థత

image

ఝార్ఖండ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఊసరవెల్లి కళేబరం రావడం కలకలం రేపింది. టోంగ్రా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పటికే ఆహారం తిన్న 65మంది పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులు వాంతులు చేసుకున్నారని, ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 13, 2024

ఏచూరి భౌతికకాయానికి చంద్రబాబు నివాళి

image

నిన్న కన్నుమూసిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతికకాయానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ఆయన ఏచూరి పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రజా సమస్యలపై పోరాడిన నిఖార్సైన కమ్యూనిస్ట్ ఏచూరి అని సీఎం కొనియాడారు. నివాళి అర్పించినవారిలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు.

News September 13, 2024

నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ఎలా కూల్చేస్తారు: HC

image

TG: హైడ్రాను రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ <<14095771>>సందర్భంగా<<>> హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ఎలా కూల్చేస్తారని ప్రశ్నించింది. జీవో 99పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ అమీన్‌పూర్‌లో ఈనెల 3న షెడ్లు కూల్చివేశారన్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.