News September 7, 2024

దీప్తి జీవాంజికి రూ.కోటి నజరానా

image

TG: పారిస్ పారాలంపిక్స్‌లో కాంస్యం గెలుచుకున్న వరంగల్(D)కు చెందిన అథ్లెట్ దీప్తి జీవాంజికి సీఎం రేవంత్ భారీ నజరానా ప్రకటించారు. ఆమెకు రూ.కోటి నగదుతో పాటు గ్రూప్-2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు. దీప్తి కోచ్‌కు రూ.10 లక్షలు నజరానా ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరోవైపు పారా గేమ్స్ క్రీడాకారులకు శిక్షణ, ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు.

Similar News

News April 16, 2026

HYD: మత్తుకు బానిసయ్యారా? ఇక్కడికి తీసుకురండి

image

మత్తుకు బానిసైన వారికి విముక్తి కల్పించడం కోసం ప్రభుత్వం డీ అడిక్షన్ సెంటర్లను ప్రారంభించింది. HYD గాంధీ ఆసుపత్రిలోనూ సెంటర్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సేవలు ప్రారంభమయ్యాయి. మద్యం, గంజాయి, సిగరెట్ ఇతర మత్తు పదార్థాలకు బానిసలుగా మారటంతో వ్యక్తిగత జీవితంతో పాటు, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వాటి నుంచి విముక్తి కల్పించడం కోసం చర్యలు చేపట్టారు.

News April 16, 2026

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 528 పాయింట్ల లాభంతో 78,639 వద్ద, నిఫ్టీ 153 పాయింట్లు పెరిగి 24,387 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్, టైటాన్, ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

News April 16, 2026

డీలిమిటేషన్.. ఏ జిల్లాలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు పెరగొచ్చు?

image

జనాభా ప్రాతిపదికనే MP సీట్ల పెంపు ఉంటుందన్న సంకేతాల నేపథ్యంలో TGలో అసెంబ్లీ స్థానాలు 178కి చేరనున్నాయి. HYD-20, RR, మేడ్చల్‌-12 చొప్పున, NZB, NLG, సంగారెడ్డిలో ఎనిమిదేసి, KMM-7, SRPT-6, MBNR, VKB, SDPT, కామారెడ్డి, KNR, HNK, కొత్తగూడెంలో ఐదేసి, ADB, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, MHBD, WGL, MDK, యాదాద్రి, నాగర్‌కర్నూల్‌లో 4, నారాయణ్‌పేట్, వనపర్తి, గద్వాల్, జనగామ, ASF-3, భూపాలపల్లి-2, ములుగు-1.