News December 5, 2024
చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తా: VSR
AP: తనకు సీఐడీ <<14794478>>లుక్ ఔట్ సర్క్యులర్<<>> జారీ చేయడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ‘కేవీ రావుకు ఫోన్ చేసి బెదిరించినట్లు ఆధారాలున్నాయా? కాకినాడ పోర్టును కేవీ రావుకు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు నాటకాలు ఆడిస్తున్నారు. నాకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేయాల్సిన అవసరం ఏంటి? చంద్రబాబు, కేవీ రావుపై పరువు నష్టం దావా వేస్తా. దీనిపై సీఐడీతో కాకుండా సీబీఐతో విచారణ జరిపించాలి’ అని అన్నారు.
Similar News
News January 24, 2025
12 వికెట్లు తీసిన జడేజా
రంజీల్లో ఓ వైపు భారత స్టార్ బ్యాటర్లు విఫలమవుతుండగా సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగిన ఆల్‌రౌండర్ జడేజా అదరగొట్టారు. ఢిల్లీతో జరిగిన మ్యాచులో రెండు ఇన్నింగ్సుల్లో కలిపి ఏకంగా 12 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్సులో 7 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. బ్యాటుతోనూ రాణించి 38 పరుగులు చేశారు. ఈ మ్యాచులో సౌరాష్ట్ర 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
News January 24, 2025
ICC టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్.. భారత్ నుంచి ముగ్గురు
టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024ను ఐసీసీ ప్రకటించింది. ఈ జట్టుకు పాట్ కమిన్స్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. టీమ్ ఇండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా, యశస్వీ జైస్వాల్, రవీంద్ర జడేజాకు స్థానం కల్పించారు. జట్టు: కమిన్స్, జైస్వాల్, బెన్ డకెట్, విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జేమీ స్మిత్, జడేజా, హెన్రీ, బుమ్రా.
News January 24, 2025
CID చేతికి కిడ్నీ రాకెట్ కేసు: మంత్రి దామోదర
TG: హైదరాబాద్‌లోని అలకనంద ఆస్పత్రిలో జరిగిన కిడ్నీ రాకెట్ కేసును CIDకి అప్పగించాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా 6 నెలలుగా ఈ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్కో ఆపరేషన్‌కు రూ.50 లక్షలు వసూలు చేశారని సమాచారం.