News October 31, 2024
టెస్టుల్లో డిఫెన్స్ కోల్పోతున్నారు: గంభీర్

T20లు ఎక్కువ ఆడడం వల్ల టెస్ట్ క్రికెట్లో ఆటగాళ్లు డిఫెన్స్ కోల్పోతున్నట్టు గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డారు. కివీస్తో 3వ టెస్ట్కు ముందు ఆయన మాట్లాడుతూ విజయవంతమైన ఆటగాళ్లందరూ టెస్టుల్లో మంచి డిఫెన్స్ టెక్నిక్ కలిగి ఉన్నారని చెప్పారు. టెస్టు క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన విరాట్ లాంటి ప్లేయర్లకు డిఫెన్స్ వారిసొంతమన్నారు. అదే టెస్ట్ క్రికెట్కు పునాదిలాంటిదని పేర్కొన్నారు.
Similar News
News December 9, 2025
ఫ్రాడ్ కాల్స్ వేధిస్తున్నాయా?

ప్రస్తుతం చాలా మందిని ఫ్రాడ్ కాల్స్, మెసేజ్లు వేధిస్తున్నాయి. అయితే వాటిపై మనం ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. సంచార్ సాథీ (<
News December 9, 2025
నువ్వుల విత్తనాలను వెదజల్లేకంటే విత్తడం మేలట

నువ్వుల పంట కోసం విత్తనాలను సాధారణంగా రైతులు వెదజల్లుతారు. అయితే విత్తనాన్ని వెదజల్లడం కంటే విత్తడం మేలంటున్నారు నిపుణులు. విత్తనాలను వరుసల మధ్య 30సెం.మీ, మొక్కల మధ్య 15సెం.మీ దూరం ఉండేటట్లు విత్తుకోవాలంటున్నారు నిపుణులు. విత్తనాలను వరుసలలో విత్తితే కలుపు తీసుకోవడానికి అనువుగా ఉండటమే కాకుండా మొక్కకు నీరు, పోషకాలు, సూర్యరశ్మి సమానంగా అంది కొమ్మలు బాగా వృద్ధి చెంది అధిక దిగుబడులు సాధించవచ్చు.
News December 9, 2025
మహాలక్ష్మి పథకంతో మహిళలకు రూ.8,459 కోట్లు ఆదా: పొన్నం

TG: మహాలక్ష్మి పథకం ద్వారా RTCలో మహిళలకు ఉచిత ప్రయాణాలు మొదలై రెండేళ్లు పూర్తయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. రెండేళ్లలో మహిళలు 251 కోట్ల జీరో టికెట్ల ద్వారా రూ.8,459 కోట్లు ఆదా చేసినట్లు వెల్లడించారు. బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాకుండా మహిళలను బస్సులకు యజమానులుగా చేసిన ప్రభుత్వంగా నిలిచిందని పేర్కొన్నారు.


