News October 31, 2024

టెస్టుల్లో డిఫెన్స్ కోల్పోతున్నారు: గంభీర్

image

T20లు ఎక్కువ ఆడ‌డం వ‌ల్ల టెస్ట్ క్రికెట్‌లో ఆట‌గాళ్లు డిఫెన్స్ కోల్పోతున్న‌ట్టు గౌత‌మ్ గంభీర్ అభిప్రాయపడ్డారు. కివీస్‌తో 3వ టెస్ట్‌కు ముందు ఆయన మాట్లాడుతూ విజ‌య‌వంత‌మైన ఆట‌గాళ్లంద‌రూ టెస్టుల్లో మంచి డిఫెన్స్ టెక్నిక్ క‌లిగి ఉన్నార‌ని చెప్పారు. టెస్టు క్రికెట్‌లో అద్భుతమైన ప్ర‌ద‌ర్శ‌న చేసిన విరాట్ లాంటి ప్లేయర్లకు డిఫెన్స్ వారిసొంత‌మ‌న్నారు. అదే టెస్ట్ క్రికెట్‌కు పునాదిలాంటిద‌ని పేర్కొన్నారు.

Similar News

News July 8, 2025

‘ఎంప్లాయ్ ఘోస్ట్ క్విట్టింగ్’ కల్చర్‌తో ఫ్యూచర్ ఢమాల్!

image

కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు.. ఉన్నవి కాపాడుకోవడమే ప్రస్తుతం గగనమైపోయింది. ఇలాంటి సమయంలో కొందరు క్షణికావేశంలో యాజమాన్యాలకు చెప్పకుండానే ఉద్యోగాన్ని వదిలేస్తున్నారు. ఆఫీసులకు వెళ్లకపోవడం, మెయిల్స్‌కు స్పందించకుండా నెగ్లెక్ట్ చేయడాన్ని ‘ఎంప్లాయ్ ఘోస్ట్ క్విట్టింగ్’ అంటారని నిపుణులు చెబుతున్నారు. ఇది ఉద్యోగి భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని, ఇలా చేస్తే ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయని హెచ్చరిస్తున్నారు.

News July 8, 2025

ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన భారత్

image

ఇంగ్లండ్‌ U19తో జరిగిన చివరి వన్డేలో భారత్ U19 చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్లు కోల్పోయి 210 పరుగులే చేసింది. అంబ్రిష్(66), సూర్యవంశీ(33) ఫర్వాలేదనిపించినా మిగిలిన అందరూ విఫలమయ్యారు. తర్వాత ఇంగ్లండ్ 31.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా టార్గెట్ ఛేదించింది. అయితే అంతకుముందు 3 మ్యాచ్‌లు గెలిచిన భారత్ 3-2తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.

News July 8, 2025

ట్రంప్ టారిఫ్స్ లేఖలు: మొదట ఈ దేశాలకే..

image

US ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్స్ వడ్డన మొదలుపెట్టారు. ఈ మేరకు ఆయా దేశాలకు అధికారికంగా లేఖలు పంపుతున్నారు. మొదటగా జపాన్, సౌత్ కొరియాలకు 25% టారిఫ్స్ విధించారు. జపాన్ PM ఇషిబా, సౌత్ కొరియా ప్రెసిడెంట్ లీ జేకు పంపిన లేఖలను ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ‘ఇది చాలా తక్కువ’ అని పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి టారిఫ్స్ అమల్లోకి వస్తాయన్నారు. దీంతో తర్వాత ఏయే కంట్రీస్‌కు ఎంత విధిస్తారో అన్న ఆందోళన మొదలైంది.