News November 17, 2024
అంచనాలను తలకిందులు చేసి.. ENGపై విండీస్ విజయం

ఇంగ్లండ్‌పై నాలుగో టీ20లో విండీస్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 219 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే ఛేదించింది. టీ20ల్లో ఆ జట్టుకు ఇది రెండో అత్యధిక రన్ ఛేజ్. విండీస్ 2 ఓవర్లకు 5/0 స్కోర్ వద్ద విన్నింగ్ పర్సెంటేజ్ కేవలం 8.37 శాతమే ఉంది. విన్ లూయిస్(68), షై హోప్(54) విజృంభణతో అంచనాలను తలకిందులు చేసి భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసింది. కాగా 5 టీ20ల సిరీస్‌ను ఇంగ్లండ్ 3-1తో కైవసం చేసుకుంది.
Similar News
News March 17, 2026
ప్రెగ్నెన్సీలో కాళ్ల వాపు ఎందుకు వస్తుంది?

ప్రెగ్నెన్సీలో కాళ్లవాపులు రావడాన్ని వైద్య పరిభాషలో జెస్టెషనల్ ఎడిమా అంటారు. గర్భిణిలలో ఏడో నెల నుంచి కాళ్లవాపు సాధారణంగా కనిపిస్తుంది. గర్భసంచి, బేబీ బరువుతో కొన్నిసార్లు కాళ్లవాపు వస్తుంది. గర్భిణుల్లో రక్త హీనత ఉన్నా, రక్తపోటు పెరిగినప్పుడు కాళ్లలో వాపు వస్తుంది. ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేసుకున్నపుడు కూడా కొన్నిసార్లు కాళ్లవాపు కనిపిస్తుంది. సమస్య ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
News March 17, 2026
డిప్రెషన్ కూడా గుండెపోటుకు కారణమే!

గుండెపోటుకు కొలెస్ట్రాల్ మాత్రమే కారణం కాదని, మానసిక సమస్యలు, నిద్రలేమి కూడా ప్రధాన కారణాలని తాజా పరిశోధనలో వెల్లడైంది. 2.2కోట్ల మందిపై చేసిన అధ్యయనంలో.. డిప్రెషన్, యాంగ్జైటీ, PTSD వల్ల గుండెపోటు ముప్పు 3 రెట్లు పెరుగుతుందని తేలింది. ‘మానసిక ఒత్తిడి వల్ల రక్తపోటు పెరిగి ధమనులు దెబ్బతింటాయి. అందుకే గుండెను కాపాడుకునేందుకు మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించండి’ అని వైద్యులు సూచిస్తున్నారు.
News March 17, 2026
డీఎంకే బెదిరించిందని ఆరోపణలు.. స్పందించిన రజినీకాంత్

రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ సమయంలో డీఎంకే ఆయన్ను బెదిరించిందని టీవీకే నేత ఆధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో సంచలనం రేపాయి. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ రజినీ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఆధవ్ అర్జున వ్యాఖ్యల్లో నిజం లేదు. ఆయన వ్యాఖ్యలను ఖండించి నాకు మద్దతుగా నిలిచిన నేతలకు, అభిమానులకు ధన్యవాదాలు. కాలం మాట్లాడకపోవచ్చు. కానీ వేచి ఉండి సమాధానం ఇస్తుంది’ అని పేర్కొన్నారు.


