News March 17, 2024
రాష్ట్రంలో విపరీతంగా పెరగబోతున్న దిగజారుడు రాజకీయాలు: YCP

AP: ఇవాళ జరగబోయే ‘ప్రజాగళం’ సభపై వైసీపీ సెటైర్లు వేసింది. ‘ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకు ఏపీలో విపరీతంగా పెరగబోతున్న దిగజారుడు రాజకీయాలు’ అని ట్వీట్ చేసింది. దీనికి గతంలో చంద్రబాబు ప్రధానిని విమర్శిస్తూ చేసిన ట్వీట్‌ను ట్యాగ్ చేసింది. కాగా సాయంత్రం టీడీపీ-బీజేపీ-జనసేన సంయుక్తంగా ‘ప్రజాగళం’ సభ నిర్వహించనున్నాయి. దీనికి ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు, పవన్ హాజరవుతారు.
Similar News
News March 29, 2025
మూడు రోజులు సెలవులే!

ఐటీ ఉద్యోగులకు వరుసగా మూడు రోజులు సెలవులొచ్చాయి. ఇవాళ శనివారం, రేపు ఆదివారం (ఉగాది) వీకెండ్ కాగా రంజాన్ సందర్భంగా సోమవారం కూడా సెలవు ఉండనుంది. దీంతో హైదరాబాద్‌ను వీడి సొంతూళ్లకు వెళ్లేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. మరికొందరేమో మూడు రోజులు ట్రిప్స్ లేదా దైవ దర్శనాలకు వెళ్లేందుకు బయల్దేరారు. కొందరికి రంజాన్‌కు సెలవు ఇవ్వలేదని చెబుతున్నారు. మీ ఆఫీసుల్లో సెలవుందా? ఎటైనా వెళ్తున్నారా? COMMENT
News March 29, 2025
రికార్డులు సృష్టించాలన్నా, వాటిని బద్దలు కొట్టాలన్నా TDPనే: లోకేశ్

AP: రికార్డులు సృష్టించాలన్నా, వాటిని బద్దలు కొట్టాలన్నా TDPకే సాధ్యమని మంత్రి లోకేశ్ అన్నారు. ‘NTR అనే 3 అక్షరాలు తెలుగువారి ఆత్మగౌరవం. 43 ఏళ్ల క్రితం ఆయన పార్టీని స్థాపించారు. 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఢిల్లీకి తెలుగువారి సత్తా చూపించారు. మన పార్టీకి గల్లీ, ఢిల్లీ పాలిటిక్స్ తెలుసు. TDP జెండా పీకేస్తారని ప్రగల్భాలు పలికిన వాళ్లు అడ్రస్ లేకుండా పోయారు’ అని పార్టీ ఆవిర్భావ సభలో తెలిపారు.
News March 29, 2025
‘ఆర్‌జీ కర్’ ఘటన గ్యాంగ్ రేప్ కాదు: CBI

RGకర్ ఆస్పత్రిలో వైద్యురాలిపై జరిగింది గ్యాంగ్ రేప్ కాదని కలకత్తా హైకోర్టుకు CBI తెలిపింది. సంజయ్ రాయ్ అన్న ఒకే నిందితుడు ఆ ఘోరానికి పాల్పడ్డాడని పేర్కొంది. ఫోరెన్సిక్ పరీక్షల అనంతరం తమకు లభించిన ఆధారాలు, నిపుణుల అభిప్రాయాలూ అదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయని వివరించింది. అయితే కేసులో మరింత పెద్ద కుట్ర దాగి ఉన్నట్లు అనుమానాలున్నాయని, వాటిని విచారిస్తున్నామని కోర్టుకు విన్నవించింది.