News March 17, 2024
రాష్ట్రంలో విపరీతంగా పెరగబోతున్న దిగజారుడు రాజకీయాలు: YCP

AP: ఇవాళ జరగబోయే ‘ప్రజాగళం’ సభపై వైసీపీ సెటైర్లు వేసింది. ‘ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకు ఏపీలో విపరీతంగా పెరగబోతున్న దిగజారుడు రాజకీయాలు’ అని ట్వీట్ చేసింది. దీనికి గతంలో చంద్రబాబు ప్రధానిని విమర్శిస్తూ చేసిన ట్వీట్‌ను ట్యాగ్ చేసింది. కాగా సాయంత్రం టీడీపీ-బీజేపీ-జనసేన సంయుక్తంగా ‘ప్రజాగళం’ సభ నిర్వహించనున్నాయి. దీనికి ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు, పవన్ హాజరవుతారు.
Similar News
News February 8, 2026
ప్రచారానికి రేపే ఆఖరు.. నేతలపై ఒత్తిళ్లు

TG: మున్సిపోల్ ప్రచారానికి రేపు సాయంత్రంతో తెరపడనుంది. ఈ క్రమంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు సుడిగాలి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. తమతమ ప్రాంతాల్లో ప్రచారానికి రావాలని ముఖ్యనేతలపై స్థానిక లీడర్ల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, BRSలో ఇదే పరిస్థితి ఉంది. మొత్తం 2,982 వార్డులకు 12,930 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నెల 11న పోలింగ్ ఉండగా 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.
News February 8, 2026
ఏగిలిచేస్తే ఏలనివానికైనా పండుతుంది

ఏగిలి చేయడం అంటే పొలాన్ని బాగా దున్నడం, చదును లేదా దమ్ము చేయడం అని అర్థం. ఏలనివానికైనా అంటే ఏమీ తెలియని వాడని అర్థం. సాగు చేయాలనుకునే నేలను బాగా చదును చేసి, దున్ని సరైన సమయంలో విత్తనం వేస్తే, వ్యవసాయం గురించి పెద్దగా అనుభవం లేని వారికైనా సరే పంట బాగా పండుతుంది. అంటే మన కష్టం మరియు నేల సత్తువ మీదే పంట దిగుబడి, ఆదాయం ఆధారపడి ఉంటుందని ఈ సామెత అంతరార్థం.
News February 8, 2026
భాను వ్రతం ఆచరిస్తే.. పాటించాల్సిన నియమాలు

సూర్య వ్రతం ఆచరించే వారు సూర్యోదయానికి మేల్కొని, పవిత్ర స్నానం ఆచరించి, సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. తెలుపు/ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. పూజా గదిలో సూర్య యంత్రాన్ని, పటాన్ని ఉంచి, ఎర్రటి పూలు, గంధంతో అర్చించాలి. రోజంతా ఉపవాసం ఉండాలి. సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు పండ్లు లేదా ఆవు పాలతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా స్వీకరించి వ్రతాన్ని ముగించాలి. దీనివల్ల ఆరోగ్యం, తేజస్సు సిద్ధిస్తాయి.


