News October 1, 2024
Meta AI చాట్ మెమరీని ఇలా డిలీట్ చేయండి
AIలను ట్రైన్ చేయడానికి Meta యూజర్ జనరేటర్ డేటాను వాడుతోందన్న ఆరోపణల నేపథ్యంలో Messenger, Instagram, WhatsAppలో AI Chat Historyని తరచూ డిలీట్ చేయడం మంచిది. AI చాట్ మెమరీని రీసెట్ చేయడానికి యూజర్లు /reset-ai కమాండ్‌ని టైప్ చేయాలి. దీంతో AI మెమరీని క్లియర్ చేయవచ్చు. గ్రూప్ చాట్స్‌కి /reset-all-ais కమాండ్ వాడాలి. యాప్స్‌లో చాట్స్ మనకు కనిపించినా AI మెమరీలో డిలీట్ అవుతాయి.
Similar News
News October 11, 2024
రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
TG: ఆరోగ్యశాఖలో మరో 371 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 272 నర్సింగ్ ఆఫీసర్లు, 99 ఫార్మాసిస్ట్ పోస్టులకు మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా గత నెలలో 2,050 స్టాఫ్ నర్స్ పోస్టులకు ప్రకటన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. నర్సింగ్ పోస్టులకు అక్టోబర్ 14, ఫార్మాసిస్ట్ పోస్టులకు అక్టోబర్ 21 వరకు అప్లై చేసుకోవచ్చు. <
News October 11, 2024
ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు
TG: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఈ కమిషన్ ఎస్సీల్లోని ఉపవర్గాల వెనుకబాటుతనంపై అధ్యయనం చేయనుంది. 60 రోజుల్లో రిపోర్ట్ సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.
News October 11, 2024
సీఎం, డిప్యూటీ సీఎం మధ్య మాటల యుద్ధం!
బారామతికి సంబంధించి శరద్ పవార్ పంపిన ప్రతిపాదనలను CM ఏక్‌నాథ్ శిండే క్యాబినెట్ ముందుంచడంపై Dy.CM అజిత్ కినుక వహించినట్లు తెలుస్తోంది. దీనిపై గురువారం జరిగిన క్యాబినెట్ భేటీలో వీరిద్దరి మధ్య వాడీవేడి చర్చ జరిగినట్టు స్థానిక మీడియా తెలిపింది. శిండే ప్రవేశపెట్టిన అంశాల ఆమోదానికి అజిత్ నిరాకరించారని, అనంతరం మీటింగ్ నుంచి వెళ్లిపోయారని ప్రచారం జరిగింది. అయితే, అజిత్ దీన్ని ఖండించారు.