News August 20, 2024
మంకీపాక్స్ చికిత్సపై ఢిల్లీ ఎయిమ్స్ గైడ్‌లైన్స్
మంకీపాక్స్ అనుమానితుల చికిత్సకు ఢిల్లీ ఎయిమ్స్ మార్గదర్శకాలు విడుదల చేసింది. జ్వరం, దద్దుర్లతో వచ్చినవారిని ఇతర పేషంట్లతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉంచాలంది. కండరాలు, నడుం నొప్పి, ఉబ్బిన నరాలు, వణుకుడు, అలసట, వెడల్పాటి దద్దుర్లను గుర్తించాలని పేర్కొంది. రీసెంటుగా మంకీపాక్స్ బాధితుల్ని ఎవరినైనా కలిశారేమో కనుక్కోవాలని చెప్పింది. వైద్య సిబ్బంది PPE కిట్లను ధరించాలని తెలిపింది.
Similar News
News September 14, 2024
కాంగ్రెస్ హామీలపై మోదీ హాట్ కామెంట్స్
హామీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ప్రధాని మోదీ విమర్శలకు దిగారు. కర్ణాటక, తెలంగాణలో రైతులకు మద్దతు ధర ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. దమ్ముంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్‌కు ఓటు వేసినందుకు కర్ణాటక, టీజీ ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. ధనిక రాష్ట్రాలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు.
News September 14, 2024
‘మత్తు వదలరా-2’ వచ్చేది ఈ ఓటీటీలోనే
నిన్న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘మత్తు వదలరా-2’ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత కొన్ని వారాలకు ఈ మూవీ ఓటీటీలో రానుంది. ఇందులో శ్రీసింహ, కమెడియన్ సత్య, హీరోయిన్ ఫరియా ప్రధాన పాత్రల్లో నటించగా, రితేశ్ రానా దర్శకత్వం వహించారు. తొలిరోజు ఈ మూవీ రూ.5.3కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.
News September 14, 2024
ఓటీటీలోకి రాజ్ తరుణ్-మాల్వీ మూవీ
ఇటీవల చర్చనీయాంశంగా మారిన జోడీ రాజ్ తరుణ్-మాల్వీ కలిసి నటించిన చిత్రం ‘తిరగబడరసామీ’. ఈ సినిమా ఆహా వేదికగా ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కాగా లావణ్య అనే యువతితో ప్రేమ వ్యవహరం ఆరోపణలతో రాజ్ తరుణ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు.