News June 29, 2024

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఘటన: కేంద్రం కీలక ఆదేశాలు

image

ఢిల్లీ విమానాశ్రయం ఘటన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిర్‌పోర్టుల నిర్మాణాలను తనిఖీ చేయాలని భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ఆదేశించింది. ఇందుకు సంబంధించిన నివేదికను 2 నుంచి 5 రోజుల్లో సమర్పించాలని పేర్కొంది. కాగా ఇవాళ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్-1 రూఫ్ కూలి ఒకరు మరణించగా, ఆరుగురు గాయపడిన సంగతి తెలిసిందే.

Similar News

News July 1, 2024

మేడిన్ ఇండియా.. టీఎన్‌టీ కంటే రెండు రెట్లు పవర్‌ఫుల్

image

ట్రైనైట్రోటాల్యునీ (TNT) కంటే రెండు రెట్లు శక్తిమంతమైన పేలుడు పదార్థాన్ని ఎకనామిక్ ఎక్స్‌ప్లోసివ్స్ అనే భారతీయ సంస్థ రూపొందించింది. సెబెక్స్2గా పిలిచే ఈ పేలుడు పదార్థాన్ని నేవీ విజయవంతంగా పరీక్షించింది. డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ స్కీమ్‌లో భాగంగా దీనిని రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సెబెక్స్2తో బాంబులు, ఆర్టిలరీ షెల్స్, వార్ హెడ్స్ వంటి ఆయుధాల సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు.

News July 1, 2024

DOCTORS DAY: వైద్యో నారాయణో హరి!

image

వైద్యులు దేవుళ్లతో సమానమని చెబుతుంటారు. తల్లిదండ్రులు జన్మనిస్తే వారు పునర్జన్మనిస్తారు. ఎంతటి వ్యాధినైనా నయం చేస్తోన్న వైద్యుల దినోత్సవం నేడు. కరోనాను ఎదుర్కోవడంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కోట్లాది మందిని కాపాడారు. వారి సేవలను నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఇంటికే ప్రాథమిక వైద్య సదుపాయాన్ని అందిస్తోన్న వైద్యులకు సెల్యూట్ చేస్తూ ప్రశంసిస్తున్నారు.

News July 1, 2024

నేషనల్ డాక్టర్స్ డే.. ఈరోజే ఎందుకంటే?

image

పశ్చిమ బెంగాల్‌ రెండో సీఎం బిధాన్ చంద్ర రాయ్ ఒక ప్రముఖ వైద్యుడు. డాక్టర్‌గా, సీఎంగా వైద్య రంగంలో ఆయన చేసిన సేవలకు గౌరవ సూచకంగా బిధాన్ పుట్టిన రోజైన జులై 1ని భారత ప్రభుత్వం జాతీయ వైద్యుల దినోత్సవంగా 1991లో ప్రకటించింది. అప్పటి నుంచి మన దేశంలో ప్రతి ఏడాది జులై 1న నేషనల్ డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా వైద్యరంగంలో డాక్టర్ల నిస్వార్థ, అమూల్యమైన సేవలను గుర్తు చేసుకుంటుంటారు.