News December 21, 2024
అందుకే పరామర్శించేందుకు వెళ్లలేదు: బన్నీ
చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చనిపోతే తాను వెళ్లి స్వయంగా పరామర్శించానని అల్లు అర్జున్ తెలిపారు. ఇప్పుడు తన అభిమాని చనిపోతే వెళ్లలేదనడం సరికాదని వ్యాఖ్యానించారు. కానీ తొక్కిసలాట తర్వాత జరిగిన పరిణామాల వల్లే వెళ్లలేకపోయానని, అందుకే నా సానుభూతి తెలియజేస్తూ వీడియో విడుదల చేశానని చెప్పారు. రేవతి మృతిపై ఎలా స్పందించాలనే దానిపై తాను ఇంకా పూర్తిగా క్లారిటీ తీసుకోలేకపోతున్నట్లు వెల్లడించారు.
Similar News
News January 14, 2025
‘మీ పరిహారం హోటల్ ఖర్చులకూ సరిపోదు’.. బైడెన్‌పై సెటైర్లు
కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్ బాధితులకు అధ్యక్షుడు జో బైడెన్ పరిహారం ప్రకటించారు. వన్ టైమ్ పేమెంట్ కింద సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు 770 డాలర్ల (రూ.66,687) చొప్పున ఇస్తామని తెలిపారు. దీనిపై కొందరు అమెరికా పౌరులు మండిపడుతున్నారు. ఉక్రెయిన్‌కు బిలియన్ల డాలర్లు ఇస్తూ తమకు ఇంత తక్కువ పరిహారం ఇస్తారా అని పోస్టులు చేస్తున్నారు. ఆ 770 డాలర్లు ఒక రోజు నైట్ హోటల్ ఖర్చులకూ చాలవని సెటైర్లు వేస్తున్నారు.
News January 14, 2025
ఒక్కొక్కరికి 6 కేజీల సన్నబియ్యం: మంత్రి
TG: రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి రూ.6 కేజీల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. దీని వల్ల ప్రభుత్వంపై రూ.12వేల కోట్ల వరకూ భారం పడుతుందన్నారు. ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం రేషన్ లబ్ధిదారులకు ఒకొక్కరికి 6 కిలోల దొడ్డు బియ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. కులగణన సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులను ఈనెల 26 నుంచి జారీ చేయనున్నారు.
News January 14, 2025
Stock Markets: నేడు పుల్‌బ్యాక్ ర్యాలీకి ఛాన్స్!
దేశీయ స్టాక్‌మార్కెట్లలో నేడు పుల్‌బ్యాక్ ర్యాలీకి ఆస్కారం కనిపిస్తోంది. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 160PTS లాభంతో 23,289 వద్ద ట్రేడవుతుండటం సానుకూల పరిణామం. డాలర్ ఇండెక్స్ పెరుగుతున్నప్పటికీ బాండ్ యీల్డులు, క్రూడాయిల్ ధరలు కాస్త తగ్గాయి. జపాన్ నిక్కీ భారీగా పతనమైంది. తైవాన్ సూచీ పెరిగింది. STOCKS 2 WATCH: HCL, ANGEL ONE, ANAND RATHI, HSCL, DEN, ADANI ENERGY