News December 1, 2024

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: కేజ్రీవాల్

image

రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. INDIA కూటమితో ఎలాంటి పొత్తు ఉండదని తేల్చిచెప్పారు. ఇటీవల తనపై జరిగిన <<14753624>>లిక్విడ్ దాడిపై<<>> స్పందిస్తూ ‘ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ సమస్యను లేవనెత్తా. దీంతో కేంద్ర హోంమంత్రి ఏదైనా చర్య తీసుకుంటారని భావించా. అయితే అందుకు విరుద్ధంగా పాదయాత్ర చేస్తున్న నాపై దాడి జరిగింది’ అని చెప్పారు.

Similar News

News February 13, 2025

దేశంలోనే కర్నూలులో హై టెంపరేచర్

image

AP: రాష్ట్రంలో మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కర్నూలులో బుధవారం దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 37.8°C నమోదైంది. రాయలసీమ, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో నిన్న పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. మరోవైపు, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఉదయం 8గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

News February 13, 2025

రేషన్ కార్డులు.. ఎక్కువ డబ్బులు తీసుకుంటే ఫిర్యాదు చేయండిలా!

image

TG: రేషన్ కార్డు దరఖాస్తు కోసం మీ-సేవ నిర్వాహకులు రూ.50 మాత్రమే తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని చోట్ల ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారని ఫిర్యాదులు రావడంతో ఆయా సెంటర్ల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. విచారణ జరిపి వారి లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. ఎవరైనా ఎక్కువ డబ్బులు తీసుకుంటే మీ-సేవ హెల్ప్ లైన్ నంబర్ 1100కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

News February 13, 2025

రేపు తెలంగాణ బంద్

image

TG: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 14న తెలంగాణ బంద్‌కు మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఇప్పటికే పిలుపునిచ్చారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని, నిర్ణయాలు తీసుకునే ముందు నేషనల్ ఎస్సీ కమిషన్‌ను సంప్రదించి ఉండాల్సిందన్నారు. బంద్ పిలుపుతో శుక్రవారం ఆర్టీసీ బస్సులు, విద్యాసంస్థలు, బ్యాంకులు, ఇతర సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

error: Content is protected !!