News April 29, 2024

ఢిల్లీ బ్యాటర్లు విఫలం.. KKR టార్గెట్ 154 రన్స్

image

KKRతో జరుగుతోన్న మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు విఫలమయ్యారు. ఆ జట్టు 20 ఓవర్లలో 153/9 స్కోర్ చేసింది. రిషభ్ పంత్ 27, అభిషేక్ పోరెల్ 18, అక్షర్ పటేల్ 15, పృథ్వీషా 13, ఫ్రేజర్ 12 రన్స్ చేశారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చివర్లో 35 పరుగులు చేసి టీమ్‌ను ఆదుకున్నారు. వరుణ్ చక్రవర్తి 3, వైభవ్ అరోరా 2, హర్షిత్ 2, నరైన్, స్టార్క్ చెరో వికెట్ తీశారు.

Similar News

News April 13, 2026

స్మార్ట్ గవర్నెన్స్.. సింగపూర్‌కు 9 మంది మంత్రులు

image

AP: ప్రజలకు స్మార్ట్ గవర్నెన్స్‌ను అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా 9 మంది మంత్రులు, ఉన్నతాధికారులకు ట్రైనింగ్ ఇప్పించనుంది. ఈ నెల 21 నుంచి 27 వరకు నారాయణ, అచ్చెన్న, నాదెండ్ల, సత్యకుమార్, అనగాని, నిమ్మల, పయ్యావుల, అనిత, జనార్దన్ సింగపూర్‌లో పర్యటించనున్నారు. రోజుకొక అంశంపై వారం రోజులపాటు శిక్షణ ఉంటుంది. వారు తిరిగొచ్చాక ఇతర ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తారు.

News April 13, 2026

అన్నదాతకు ‘ఉల్లి’పోటు.. భారీగా పడిపోయిన ధర

image

TG: ఉల్లి ధరలు రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. సంగారెడ్డి(D) సదాశివపేట మార్కెట్‌లో గతేడాది APRలో రూ.2,300 పలికిన క్వింటాల్ ఉల్లి తాజాగా రూ.504కు పడిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో ఉల్లి సాగవుతోంది. JAN-MAY మధ్య భారీగా దిగుబడి వస్తుంది. దీంతో ధరలు పతనమయ్యాయి. హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో వ్యాపారులు రూ.100కు 5-8 కిలోల వరకు ఉల్లి విక్రయిస్తున్నారు.

News April 13, 2026

సెన్సస్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్, జైలు శిక్ష

image

AP: సెన్సస్-2027లో భాగంగా రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి 30 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు అవకాశం ఉంటుంది. మే 1 నుంచి క్షేత్రస్థాయి గణన ప్రారంభం కానుంది. అధికారులు జనాభా లెక్కల కోసం వచ్చినప్పుడు ఇళ్ల యజమానులు అనుమతించాలని ప్రభుత్వం సూచించింది. ‘వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఇదే రూల్ అధికారులకూ వర్తిస్తుంది’ అని పేర్కొంది.