News April 9, 2025
ఇంటి నుంచే పనిచేస్తున్న ఢిల్లీ సీఎం రేఖ

ఢిల్లీ CMగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టి 50 రోజులు పూర్తయినా అధికారిక నివాసంపై నిర్ణయం తీసుకోలేదు. మాజీ సీఎం కేజ్రీవాల్ నివసించిన బంగ్లాలోకి వెళ్లడానికి ఆమె ఇష్టపడలేదు. షాలిమార్ బాగ్లోని తన నివాసం నుంచే విధులు నిర్వర్తిస్తుండటంతో VIPలు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 25KM ప్రయాణించి ఆమె సచివాలయానికి వెళ్తున్నారు. సివిల్ లైన్స్ లేదా లుటియెన్స్లో నివాసం కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Similar News
News April 18, 2025
అరుదైన ఘనత సాధించిన హెడ్

IPL: వాంఖడేలో MIతో జరుగుతున్న మ్యాచ్లో SRH ఓపెనర్ ట్రావిస్ హెడ్ అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్ చరిత్రలో వేగంగా 1000 రన్స్ పూర్తి చేసిన రెండో ఆటగాడిగా నిలిచారు. మొత్తంగా 575 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకున్నారు. ఈ జాబితాలో తొలి స్థానంలో రస్సెల్(545), హెడ్ తర్వాత క్లాసెన్(594), సెహ్వాగ్(604), మ్యాక్స్వెల్(610), యూసుఫ్ పఠాన్(617), నరైన్(617) ఉన్నారు.
News April 18, 2025
ఏప్రిల్ 18: చరిత్రలో ఈరోజు

1809: కవి, పండితుడు హెన్రీ డెరోజియా జననం
1880: రచయిత టేకుమళ్ల అచ్యుతరావు జననం
1958: విండీస్ మాజీ క్రికెటర్ మాల్కం మార్షల్ జననం
1859: స్వాతంత్ర్యసమరయోధుడు తాంతియా తోపే మరణం
1955: శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్(ఫొటోలో) మరణం
* ప్రపంచ వారసత్వ దినోత్సవం (అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం)
News April 18, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.