News August 2, 2024
Delhi coaching center deaths : రూ.10 లక్షల చొప్పున పరిహారం

ఢిల్లీ వరదల్లో చనిపోయిన సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కుటుంబాలకు దృష్టి IAS పరిహారం ప్రకటించింది. ‘పిల్లల మరణంతో కలిగే బాధను ఎంత డబ్బిచ్చినా పోగొట్టలేం. ఆ 4 కుటుంబాలను ఆదుకొనేందుకే తలో రూ.10 లక్షలు అందిస్తున్నాం’ అని దృష్టి IAS డైరెక్టర్ దివ్య కీర్తి అన్నారు. రావూస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు రావడంతో ముగ్గురు అభ్యర్థులు మరణించారు. మరొకరు హాస్టల్‌కు వెళ్తుండగా కరెంటు షాక్‌తో చనిపోయారు.
Similar News
News January 6, 2026
ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిని పట్టించే హెల్మెట్!

ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనాలను గుర్తించే AI హెల్మెట్‌ను బెంగళూరుకు చెందిన ఓ టెకీ తయారు చేశారు. హెల్మెట్‌కు కెమెరాను అమర్చి దానికి AIని జోడించారు. రోడ్డుపై ఎవరైనా హెల్మెట్ లేకుండా, రాంగ్ రూట్లో వెళ్తే ఇది గుర్తించి ఫొటో తీస్తుంది. లొకేషన్, బండి నంబర్‌తో సహా ఆ ఫొటోలను పోలీసులకు పంపి ఛలాన్ వేసేలా చేస్తుంది. టెక్నాలజీ సాయంతో రోడ్డు భద్రతను పెంచే ఇలాంటి ఐడియాలు అవసరమని పోలీసులు అతడిని ప్రశంసించారు.
News January 6, 2026
ఏడిస్తే ముక్కు ఎందుకు కారుతుందో తెలుసా?

మానవ శరీర వ్యవస్థ ఒక ఇంజినీరింగ్ అద్భుతం. మన కంటి మూలలో సూది మొనంత ఉండే ‘లాక్రిమల్ పంక్టం’ అనే రంధ్రం ఒక అదృశ్య డ్రైనేజీ పైపులా పనిచేస్తుంది. కళ్లలో ఊరే అదనపు కన్నీళ్లను ఇది ముక్కులోకి పంపిస్తుంది. అందుకే మనం ఏడ్చినప్పుడు ముక్కు కూడా కారుతుంది. ఈ చిన్న రంధ్రం కంటి తేమను కాపాడుతూ చూపును స్పష్టంగా ఉంచుతుంది. అంటే మనం ఏడుస్తున్నప్పుడు ముక్కు నుంచి కారేది ‘కన్నీళ్లే’. share it
News January 6, 2026
పరకామణి అంశంలో పోలీసు అధికారులపై కేసులకు హైకోర్టు ఆదేశం

AP: TTD పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏసీబీ, సీఐడీలకు ఉత్తర్వులు ఇచ్చింది. కేసు దర్యాప్తులో ముందుకు సాగాలని ఆ రెండు విభాగాలకు స్పష్టం చేసింది. పరకామణి లెక్కింపు అంశంలో విధివిధానాలు ఖరారు చేయాలని టీటీడీని ఆదేశించింది. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది.


