News August 2, 2024

Delhi coaching center deaths : రూ.10 లక్షల చొప్పున పరిహారం

image

ఢిల్లీ వరదల్లో చనిపోయిన సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కుటుంబాలకు దృష్టి IAS పరిహారం ప్రకటించింది. ‘పిల్లల మరణంతో కలిగే బాధను ఎంత డబ్బిచ్చినా పోగొట్టలేం. ఆ 4 కుటుంబాలను ఆదుకొనేందుకే తలో రూ.10 లక్షలు అందిస్తున్నాం’ అని దృష్టి IAS డైరెక్టర్ దివ్య కీర్తి అన్నారు. రావూస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్లోకి వరద నీరు రావడంతో ముగ్గురు అభ్యర్థులు మరణించారు. మరొకరు హాస్టల్‌కు వెళ్తుండగా కరెంటు షాక్‌తో చనిపోయారు.

Similar News

News December 5, 2024

మిగ్‌లను కొనసాగించనున్న వాయుసేన

image

మిగ్-21 బైసన్ విమానాల్ని మరికొంత కాలం కొనసాగించాలని భారత వాయుసేన నిర్ణయించినట్లు తెలుస్తోంది. ‘ఎగిరే శవపేటికలు’గా పేరొందిన మిగ్‌లలో సమస్యల కారణంగా వందలాదిమంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. వీటిని ఈ ఏడాది డిసెంబరుకల్లా తప్పించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే వాటి స్థానంలో రావాల్సిన తేజస్ MK1A విమానాల తయారీ లేట్ కావడంతో మిగ్‌లను మరికొంతకాలం కొనసాగించనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.

News December 5, 2024

UAN యాక్టివేషన్ గడువు పొడిగింపు

image

కేంద్రం తీసుకొచ్చిన ELI పథకం ప్ర‌యోజ‌నాల కోసం ఆధార్ అనుసంధాన UAN యాక్టివేషన్ గడువును EPFO పొడిగించింది. నవంబర్ 30తోనే డెడ్‌లైన్ ముగియగా దాన్ని డిసెంబర్ 15 వరకు పెంచింది. ఈ స్కీం ద్వారా ఉద్యోగుల‌కు 3 విడ‌త‌ల్లో రూ.15 వేల వ‌ర‌కు సాయం అందుతుంది. ఉద్యోగికి, యజమానికి ప్రోత్సాహకాలు, ప్రతి కొత్త ఉద్యోగికి EPFO వాటాగా యజమానులు చెల్లించేందుకు రెండేళ్లపాటు నెలకు రూ.3వేల వరకు కేంద్రం ఇస్తుంది.

News December 5, 2024

పవర్ గ్రిడ్ పతనం.. క్యూబాలో అంధకారం

image

క్యూబాలో పవర్ గ్రిడ్ పతనం కావడంతో అంధకారం అలుముకుంది. దీంతో దేశంలోని పాఠశాలలు, పరిశ్రమలు, హోటళ్లు మూతపడ్డాయి. దేశంలోని లక్షలాది మంద ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఒక్కసారిగా ఆహారం, నీళ్లు, మందులు, ఇంధనం దొరకక జనం అల్లాడుతున్నారు. ఫోన్లు, ఫ్యాన్లు, టీవీలు మూగబోవడంతో దిక్కుతోచక ఎదురుచూస్తున్నారు. కాగా గ్రిడ్ పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు ఆ దేశ విద్యుత్‌శాఖ మంత్రి విసెంటే డి లా ఒలెవీ తెలిపారు.