News February 7, 2025

ఢిల్లీ దంగల్: AAP, BJP పోటాపోటీ మీటింగ్స్

image

ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందు ఢిల్లీలో రాజకీయ వాతావరణం సీరియస్‌గా మారింది. నువ్వానేనా అన్నట్టుగా పోటీపడిన రెండు ప్రధాన పార్టీలు వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. BJP ఎరవేస్తోందంటూ ఆరోపించిన ఆప్ 70 మంది అభ్యర్థులను పార్టీ ఆఫీస్‌కు పిలిపించింది. మరోవైపు ఎంపీలు, పార్టీ కోఆర్డినేటర్లతో BJP కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఫలితాలు, ఆ తర్వాతి పరిణామాలపై రెండు పార్టీలూ చర్చిస్తున్నట్టు తెలిసింది.

Similar News

News February 7, 2025

దారుణం.. రైల్లోంచి గర్భిణిని నెట్టేసిన దుండగుడు

image

తిరుపతి-కోయంబత్తూరు మధ్య ప్రయాణించే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో దారుణం చోటుచేసుకుంది. ఓ దుండగుడు గర్భిణిని లైంగిక వేధింపులకు గురిచేసి, రైల్లోంచి కిందకి నెట్టివేశాడు. ఈ ఘటన కేవీ కుప్పం రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. రక్తపుమడుగులో పడి ఉన్న మహిళను జోలార్‌పేట పోలీసులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు పాల్పడిన వేలూరు కేవీ కుప్పంకు చెందిన హేమరాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

News February 7, 2025

మహాకుంభమేళా @40 కోట్ల మంది భక్తులు

image

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నేటి వరకు 40 కోట్ల మందికి పైగా త్రివేణీ సంగమం వద్ద పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఇవాళ కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. సెక్టార్-18 శంకరాచార్య మార్గంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

News February 7, 2025

ఇవాళ రాత్రికి అంతర్వేదిలో కళ్యాణోత్సవం

image

AP: అంబేడ్కర్ కోనసీమ(D) సఖినేటిపల్లి(మ) అంతర్వేదిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం ఇవాళ జరగనుంది. అర్ధరాత్రి 12.55 గంటలకు మృగశిరా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో అర్చకులు కళ్యాణం జరిపించనున్నారు. దాదాపు 2-3 లక్షల మంది భక్తులు ఈ వేడుక కోసం తరలిరానున్నారు. ఆర్టీసీ దాదాపుగా 105 బస్సులు తిప్పుతుండగా, 1600 మంది సిబ్బందితో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

error: Content is protected !!