News October 14, 2024
వికీపీడియాకు ఢిల్లీ హైకోర్టు చురకలు
వార్తా సంస్థ ANI పేజీని ఎడిట్ చేసిన వారి వివరాలను వెల్లడించడానికి నిరాకరించినందుకు ఢిల్లీ హైకోర్టు వికీపీడియాకు చురకలంటించింది. కొందరు యూజర్లు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి ANI ప్రచార సాధనం అని ఎడిట్ చేశారు. దీంతో వికీపీడియాపై ANI పరువు నష్టం దావా వేసింది. కాగా ఆ యూజర్ల వివరాలివ్వాలని HC గతంలోనే వికీపీడియాకు సమన్లు పంపింది. వికీపీడియా వెల్లడించకపోవడంతో తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
Similar News
News November 7, 2024
131 ఏళ్లలో ఒకే ఒక్కడు ట్రంప్
అమెరికా అధ్యక్ష పీఠంపై వరుసగా రెండుసార్లు కూర్చున్న నేతలు 15 మంది ఉన్నారు. వారిలో లింకన్, నిక్సన్, క్లింటన్, జార్జ్ బుష్, ఒబామా ముఖ్యులు. అయితే తొలి దఫా(2016-20) తర్వాత వెంటనే కాకుండా నాలుగేళ్ల వ్యవధి అనంతరం పదవి చేపట్టిన రెండో నేతగా ట్రంప్ నిలిచారు. గత 131 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి. చివరిసారిగా గ్రోవర్ క్లీవ్‌లాండ్(1885-89, 1893-97) ఇలా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
News November 7, 2024
‘పుష్ప-2’ BGM కోసం రంగంలోకి తమన్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ గురించి ఇంట్రెస్టింగ్ విషయం వైరలవుతోంది. ఈ చిత్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేసేందుకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రంగంలోకి దిగినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే వర్క్ స్టార్ట్ అయిందని తెలిపాయి. కాగా, దేవి శ్రీ ప్రసాద్ సినిమాలోని సాంగ్స్‌ను కంపోజ్ చేశారు. దీంతో ‘పుష్ప-2’ కోసం ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేస్తున్నారు.
News November 7, 2024
INDIA A: మళ్లీ అదే కథ
ఆస్ట్రేలియా ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో ఇండియా ఏ బ్యాటర్లు ఘోరంగా విఫలమవుతున్నారు. ప్రస్తుతం భారత్ 64 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్ డకౌటయ్యారు. సీనియర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్ 4 పరుగులకే వెనుదిరిగి నిరాశపరిచారు. ప్రస్తుతం క్రీజులో ధ్రువ్ జురేల్ (24*), నితీశ్ రెడ్డి (0*) ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో మైకేల్ నెసెర్ 4 వికెట్లతో చెలరేగారు.