News March 2, 2025
ఢిల్లీ జోరు.. కప్పు కొట్టేనా?

WPLలో ఢిల్లీ క్యాపిటల్స్ జోరు కొనసాగుతోంది. నిన్న ఆర్సీబీపై విజయంతో ఈ ఏడాది ప్లేఆఫ్ చేరుకున్న తొలి టీమ్గా నిలిచింది. గత రెండేళ్లలో ఫైనల్ చేరిన ఈ జట్టుకు కప్పు మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. ఈ సారైనా మెగ్ లానింగ్ నాయకత్వంలో టీమ్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. సారథితో పాటు షఫాలీ ఫామ్లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.
Similar News
News November 25, 2025
BRSకు నిధుల కొరత.. రూ.15 కోట్లకు తగ్గిన డొనేషన్లు!

TG: అసెంబ్లీ ఎన్నికలతోపాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటమి, పార్టీ అధినేత KCR ప్రజల్లోకి రాకపోవడం, కవిత ఆరోపణలు, BJPతో విలీన రూమర్లతో రాష్ట్రంలో BRS ఇమేజ్ మసకబారిందని తెలుస్తోంది. దీంతో ఆ పార్టీకి విరాళాలు భారీగా తగ్గినట్టు వార్తలు వస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 580.52 కోట్లుగా ఉన్న డొనేషన్లు, ఈ ఏడాది రూ.15 కోట్లకు పడిపోయినట్టు సమాచారం. దీంతో BRS నిధుల లేమితో ఇబ్బంది పడుతోందని టాక్.
News November 25, 2025
మిరపలో జెమిని వైరస్ను ఈ లక్షణాలతో గుర్తించండి

వాతావరణ మార్పుల కారణంగా కొన్నిచోట్ల మిరపలో జెమిని వైరస్ కనిపిస్తోంది. ఇది ఆశించిన మొక్కల ఆకులు చిన్నవిగా మారి పైకి ముడుచుకొని పడవ ఆకారంలో ఉంటాయి. ఆకుల ఈనెలు ఆకుపచ్చగాను, ఈనెల మధ్య లేత ఆకుపచ్చగా లేదా పసుపు పచ్చగా మారుతాయి. కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. దీనికి తోడు కొన్నిచోట్ల పచ్చదోమ కూడా కనిపిస్తోంది. దీని వల్ల మొక్క పెరుగుదల, దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది.
News November 25, 2025
మిరపలో జెమిని వైరస్ను ఎలా నివారించాలి?

జెమిని వైరస్ నివారణకు ముందుజాగ్రత్తగా రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించాలి. వ్యాధిసోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. పొలంలో కలుపు మొక్కలను తీసివేయాలి. పసుపు రంగు జిగురు అట్టలను ఎకరాకు 8 నుంచి 10 అమర్చితే రసం పీల్చే పురుగుల ఉద్ధృతి తగ్గుతుంది. జెమిని వైరస్ నివారణకు లీటరు నీటికి పైరిప్రాక్సిపెన్ 1.5ml లేదా పైరిప్రాక్సిపెన్ + ఫెన్ప్రోపాత్రిన్ 1ml మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.


