News March 21, 2024

మరో రెండేళ్లలో ఎస్-400 డెలివరీ పూర్తి

image

2026కల్లా రష్యా నుంచి భారత్‌కు రావాల్సిన మిగిలిన రెండు ఎస్-400 స్క్వాడ్రన్ల డెలివరీ పూర్తికానుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం 5 స్క్వాడ్రన్లను ఈ ఏడాదికల్లా న్యూఢిల్లీకి క్రెమ్లిన్ ఇవ్వాల్సి ఉండగా.. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం కారణంగా అవి ఆలస్యమయ్యాయని వివరించాయి. భారత్ వద్ద ప్రస్తుతం 3 ఎస్-400 స్క్వాడ్రన్లు ఉన్నాయి. ఈ గగనతల రక్షణ వ్యవస్థల్ని చైనా, పాక్ సరిహద్దుల్లో భారత్ మోహరించింది.

Similar News

News November 26, 2025

APPLY NOW: BECILలో ఉద్యోగాలు

image

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీర్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) 18 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 7వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెడికల్ ఫిజిసిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి టెన్త్, ఇంటర్, PG, PG డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డ్రైవర్ పోస్టుకు హెవీ వెహికల్ లైసెన్స్ తప్పనిసరి.

News November 26, 2025

రేవంత్ రూ.50వేల కోట్ల విద్యుత్ స్కాం: హరీశ్‌రావు

image

TG: CM రేవంత్ మరో అతిపెద్ద పవర్ స్కాంకు రూపకల్పన చేశారని, ఇది అక్షరాల రూ.50వేల కోట్ల కుంభకోణం అని హరీశ్‌రావు ఆరోపించారు. పవర్ ప్లాంట్ల నిర్మాణానికి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుని, కమీషన్ల కక్కుర్తికి మాస్టర్ ప్లాన్ వేశారని మీడియా సమావేశంలో తెలిపారు. ఒక్కో యూనిట్‌కు రూ.7.92 ఖర్చు చేయబోతున్నారని, ఇది ఎవరి ప్రయోజనం కోసం అని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ కోసమే కొత్త డిస్కం తెస్తున్నారని విమర్శించారు.

News November 26, 2025

ఈ రెస్టారెంట్లో సింగిల్స్‌కు నో ఎంట్రీ!

image

దక్షిణ కొరియాలోని యోసు సిటీలోని ఓ రెస్టారెంట్ ఒంటరిగా వచ్చే వారికి అనుమతి లేదని ప్రకటించడం వివాదానికి దారితీసింది. సింగిల్‌ కస్టమర్లు ఇద్దరికి భోజనం కొనాలని లేదా ఫ్రెండ్‌/భార్యతో రావాలంటూ నిబంధనలు పెట్టింది. కొంతకాలంగా కొరియాలో “హోన్‌బాప్” అనే పేరుతో ఒంటరిగా తినే ట్రెండ్ పెరుగుతోంది. ఒంటరిగా తినడం ఒంటరితనం కాదని పలువురు అభిప్రాయపడుతుండగా, కొందరు ఈ నిర్ణయాన్ని సపోర్టు చేస్తున్నారు.