News October 28, 2024

నెలకు రూ.6,000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్

image

TG: దివ్యాంగుల పెన్షన్‌ను రూ.6వేలకు పెంచాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కమిటీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరింది. పెంచిన పెన్షన్‌ను 2024 జనవరి నుంచి అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ హామీ అమలు కోసం త్వరలోనే ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు ప్రకటించింది.

Similar News

News November 10, 2024

పిల్లలతో కలిసి చెరువులో దూకి తండ్రి ఆత్మహత్య

image

TG: సిద్దిపేటలో విషాదం చోటుచేసుకుంది. తేలు సత్యం(50) అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలిసి చింతల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. తండ్రితో పాటు అభంశుభం తెలియని చిన్నారులు అశ్విన్, త్రివర్ణ విగతజీవులుగా కనిపించడం కలిచివేసింది.

News November 10, 2024

ఆరిజోనా కూడా ట్రంప్ ఖాతాలోకే.. స్వింగ్ స్టేట్స్ క్లీన్‌స్వీప్

image

US ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడ్డాయి. చివరగా ఆరిజోనా కూడా ట్రంప్ ఖాతాలోకి వెళ్లిపోయింది. అక్కడి 11 ఎలక్టోరల్ ఓట్స్ కలుపుకుని మొత్తంగా ఆయనకు 312 ఓట్లు వచ్చాయి. స్వింగ్ స్టేట్స్ అయిన పెన్సిల్వేనియా, మిచిగాన్, నెవాడా, జార్జియా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్‌ను ట్రంప్ క్లీన్‌స్వీప్ చేశారు. డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ 226 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ట్రంప్‌కు 50.5%, కమలకు 47.9% ఓట్లు వచ్చాయి.

News November 10, 2024

ఒకే స్కూల్‌లో 120 మంది కవలలు

image

పంజాబ్‌లోని జలంధర్‌లో పోలీస్ DAV పబ్లిక్ స్కూల్‌కి వెళితే ఆ స్టూడెంట్స్‌ను చూశాక ఎవరైనా కన్ఫ్యూజ్ కావాల్సిందే. స్కూల్‌లో ఎక్కడ చూసినా కవలలే కనిపిస్తే కన్ఫ్యూజ్ కాకుండా ఎలా ఉంటారు మరి! ఇక్కడ 60 జతలు అంటే మొత్తం 120 మంది విద్యార్థులు కవలలే. ఇందులో ట్విన్స్(ఇద్దరు) మాత్రమే కాదు ట్రిప్లెట్స్(ముగ్గురు కవలలు) కూడా ఉన్నారు. కాగా కవల పిల్లలు పుట్టడం ప్రకృతిలో ఒక అద్భుతమని అక్కడి టీచర్లంటున్నారు.