News May 26, 2024
స్కూళ్లకు సెలవులు పెంచాలని డిమాండ్

TG: పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ <<13313530>>క్యాలెండర్‌లో <<>>మార్పులు చేయాలని తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్(TSTU) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పండుగలకు ఇచ్చే సెలవుల్లో శాస్త్రీయత లేదని అభిప్రాయపడింది. తొలి ఏకాదశి పండుగకు సెలవు, దీపావళికి 2 రోజులు, మహా శివరాత్రి మరుసటి రోజు సెలవు ఇవ్వాలని కోరింది. ఈ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని, విద్యా క్యాలెండర్‌లో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేసింది.
Similar News
News February 8, 2025
వైభవంగా అంతర్వేదిలో కళ్యాణోత్సవం

AP: అంబేడ్కర్ కోనసీమ(D)లోని అంతర్వేదిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. అర్ధరాత్రి 12.55 గంటలకు మృగశిరా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో స్వామివారికి అర్చకులు వివాహం జరిపించారు. ఈ వేడుకను వీక్షించేందుకు దాదాపు 2-3 లక్షల మంది భక్తులు తరలివచ్చినట్లు అంచనా.
News February 8, 2025
ఫిబ్రవరి 8: చరిత్రలో ఈరోజు

✒ 1897: మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ జననం(ఫొటోలో)
✒ 1902: సుప్రసిద్ధ కవి ఆండ్ర శేషగిరిరావు జననం
✒ 1934: ప్రముఖ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వర రావు జననం
✒ 1941: గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ జననం
✒ 1957: నటి వై.విజయ జననం
✒ 1963: IND మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ జననం(ఫొటోలో)
News February 8, 2025
BPL-2025 విజేత ఫార్చూన్ బారిషల్

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025 ఎడిషన్ విజేతగా ఫార్చూన్ బారిషల్ నిలిచింది. ఫైనల్‌లో చిట్టగాంగ్ కింగ్స్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత చిట్టగాంగ్ 194/3 స్కోర్ చేయగా బారిషల్ 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టుకు వరుసగా రెండో టైటిల్ కావడం విశేషం. విజేతకు రూ.2.50 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. BPLలో మొత్తం ఏడు టీమ్‌లు పాల్గొన్న విషయం తెలిసిందే.