News November 5, 2024
డెమొక్రాట్VSరిపబ్లికన్: ఎవరిది ఆధిపత్యం?
అమెరికాలో చిన్నాచితకా పార్టీలు ఎన్ని ఉన్నా డెమొక్రటిక్(గుర్తు గాడిద), రిపబ్లికన్ల(సింబల్ ఏనుగు) మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. 1854 నుంచి ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది. 1790లో ఏర్పడిన డెమొక్రటిక్ ప్రపంచంలోనే ఓల్డెస్ట్ పార్టీల్లో ఒకటి. ఆ పార్టీ తరఫున ఇప్పటి వరకు 16 మంది అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 1854లో ప్రారంభమైన రిపబ్లికన్ పార్టీ నుంచి 19 మంది ప్రెసిడెంట్లుగా పనిచేశారు.
Similar News
News December 7, 2024
ఏడాదిలోనే 55వేల ఉద్యోగాలిచ్చాం: రేవంత్
తాము మొదటి ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇన్ని ఉద్యోగాలు దేశంలో ఎవరూ ఇవ్వలేదని, ఇదో రికార్డు అని తెలిపారు. శాఖల వారీగా ఎన్ని ఉద్యోగాలిచ్చామో అసెంబ్లీలో రుజువు చేస్తామని, కేసీఆర్ రావాలని సవాల్ విసిరారు. ఉద్యోగాలపై BRS చెప్పిందే బీజేపీ చెప్పిందని.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 55వేల ఉద్యోగాలిచ్చారని నిరూపిస్తే ఢిల్లీలో క్షమాపణలు చెప్తానని సవాల్ విసిరారు.
News December 7, 2024
వరంగల్ మిర్చికి అరుదైన ఘనత
TG: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగు చేసే చపాట మిర్చికి అరుదైన ఘనత లభించింది. దీనికి జీయో ట్యాగ్ గుర్తింపునకు ఇండియన్ పేటెంట్ ఆఫీస్(IPO) ఆమోదం తెలిపింది. ఈ రకం మిరపకాయలు టమాటా వలె ఉంటాయి. ఇందులో కారం తక్కువ మోతాదులో ఉంటుంది. రెండేళ్ల క్రితం ఈ మిర్చికి వరంగల్ మార్కెట్‌లో రూ.లక్ష ధర పలకడం గమనార్హం.
News December 7, 2024
ఢిల్లీని రిషభ్ పంత్ వదిలేయడానికి కారణమిదే: కోచ్
రిషభ్ పంత్‌ను IPL వేలంలో LSG రికార్డు స్థాయిలో రూ.27 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీని పంత్ వదిలేయడానికి గల కారణాన్ని ఆ జట్టు కోచ్ హేమాంగ్ బదానీ వెల్లడించారు. ‘పంత్ వేలంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తానెంత ధర పలుకుతానో చూడాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఎంత ఒప్పించడానికి ట్రై చేసినా వినలేదు. అన్నట్లుగానే భారీ ధర పలికాడు. మంచి ఆటగాడికి న్యాయంగానే భారీ ధర దక్కింది’ అని పేర్కొన్నారు.