News August 24, 2024

N కన్వెన్షన్ కూల్చివేత.. డిప్యూటీ సీఎం ఏమన్నారంటే?

image

TG: సినీ హీరో నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ కూల్చివేతపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ‘బఫర్ జోన్‌లో కాదు. చెరువులోనే నిర్మాణాలు చేపట్టారు. చెరువులు ఆక్రమణకు గురికాకుండా చూసేందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం. కబ్జాలు, నిర్మాణాలకు సంబంధించిన శాటిలైట్ ఫొటోలను ప్రజల ముందు ఉంచుతాం. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.

Similar News

News September 13, 2025

ముంబై పేలుళ్ల కేసు.. రూ.9 కోట్లు ఇప్పించాలని నిర్దోషి డిమాండ్

image

2006 ముంబై పేలుళ్ల కేసులో అరెస్టయి 2015లో నిర్దోషిగా విడుదలైన అబ్దుల్ వాహిద్ షేక్ పరిహారం కోరుతూ NHRCని ఆశ్రయించాడు. కస్టోడియల్ టార్చర్ వల్ల ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం దెబ్బతిన్నాయని, రూ.9CR ఇప్పించాలని దరఖాస్తు చేశాడు. 2015లో ఈ కేసులో ఐదుగురికి మరణశిక్ష, ఏడుగురికి జీవిత ఖైదు విధించగా, మిగిలిన 12 మంది నిందితులను ఈ ఏడాది జులైలో కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. పేలుళ్ల ఘటనలో 180+ మంది మరణించారు.

News September 13, 2025

విశాఖ బీచ్ రోడ్ – భోగాపురం ఎయిర్‌పోర్టుకు 6 లైన్ల రోడ్డు!

image

AP: విశాఖ బీచ్ రోడ్ నుంచి భీమిలి మీదుగా భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు 6 లైన్ల రహదారి నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కొండల మధ్య నుంచి వెళ్లే పాత మార్గం స్థానంలో వేగవంతమైన రోడ్డుతో అనుసంధానించాలని చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో భీమిలి-భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును ప్రతిపాదించారు. ఆ మార్గం స్థానిక రాజకీయ నాయకుల స్థలాలకు అనుకూలంగా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి.

News September 13, 2025

బీసీసీఐలో భజ్జీకి కీలక పదవి?

image

భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు బీసీసీఐలో కీలక పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. ఆయనను యాన్యువల్ జనరల్ మీటింగ్(ఏజీఎం)లో తమ ప్రతినిధిగా పంజాబ్ నామినేట్ చేసింది. ఈమేరకు ఆయన ఈనెల 28న జరగనున్న ఏజీఎం మీటింగ్‌కు హాజరుకానున్నారు. అందులో బీసీసీఐ ప్రెసిడెంట్‌తో పాటు ఇతర పోస్టులకు సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉంది. మరి భజ్జీని ఏ పదవి వరిస్తుందో చూడాలి.