News August 31, 2024

ముందస్తు నోటీసులు లేకుండా కూల్చడం బాధాకరం: పల్లం రాజు

image

TG: తన సోదరుడు ఆనంద్‌కు చెందిన స్పోర్ట్స్ విలేజ్‌ను అక్రమంగా కూల్చివేశారని కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని అనుమతులతో 7 ఎకరాలు లీజుకు తీసుకొని OROను ఏర్పాటు చేశామన్నారు. 2015 నుంచే ఇది నిర్వహణలో ఉందని, ఎలాంటి నోటీసులు లేకుండా హైడ్రా కూల్చివేయడం బాధించిందని Xలో రాసుకొచ్చారు. ప్రజా జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా పనిచేసిన తమపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమన్నారు.

Similar News

News February 1, 2025

బడ్జెట్: నిర్మలా సీతారామన్ చీర ప్రత్యేకత ఇదే

image

బిహార్ రాష్ట్రానికి చెందిన మధుబని ఆర్ట్, పద్మ అవార్డు గ్రహీత దులారి దేవి కళకు గౌరవ సూచకంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ చీరను ధరించారు. గతంలో మిథిలా ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో క్రెడిట్ ఔట్‌రీచ్ యాక్టివిటీ కోసం వెళ్లినప్పుడు దులారి దేవిని నిర్మల కలిశారు. మధుబని ఆర్ట్ గురించి చర్చించారు. ఈ సందర్భంగా దులారి దేవి ఈ చీరను బహూకరించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు ధరించాలని కోరారు.

News February 1, 2025

దారుణం.. తల్లి మృతదేహంతో తొమ్మిది రోజులు!

image

TG: తల్లి మృతదేహం పక్కనే డిప్రెషన్‌తో ఇద్దరు కూతుళ్లు 9రోజులు గడిపారు. HYDలోని బౌద్ధనగర్‌కు చెందిన రాజు, లలిత(45)కు రవళిక, అశ్విత ఇద్దరు కుమార్తెలు. 4ఏళ్ల క్రితం వీరిని వదిలేసి రాజు ఎక్కడికో వెళ్లాడు. ఈ క్రమంలో లలిత గుండెపోటుతో మరణించారు. అంతిమ సంస్కారాలకు డబ్బులు లేక కూతుళ్లు కూడా చనిపోవాలనుకున్నారు. ఆ ప్రయత్నం విఫలమవడంతో నిన్న బాహ్య ప్రపంచానికి తెలిపారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

News February 1, 2025

Stock Markets: బడ్జెట్‌కు ముందు మార్కెట్లు అప్

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 25,555 (+50), సెన్సెక్స్ 77,695 (+210) వద్ద ట్రేడవుతున్నాయి. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, మీడియా, రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఐటీసీ హోటల్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, బీఈఎల్, అల్ట్రాటెక్ సెమ్ టాప్ గెయినర్స్. హీరోమోటో, డాక్టర్ రెడ్డీస్, టైటాన్, గ్రాసిమ్, ట్రెండ్ టాప్ లూజర్స్.