News September 17, 2024
27న OTTలోకి ‘డిమోంటీ కాలనీ-2’
అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ ‘డిమోంటీ కాలనీ-2’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 27 నుంచి జీ5లో తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.50 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. 2015లో వచ్చిన తొలి పార్ట్ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
Similar News
News October 15, 2024
RED ALERT: ఈ జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు
AP: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా భారత వాతావరణ విభాగం (IMD) నేడు ఏపీలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
News October 15, 2024
నేటి నుంచి పాఠశాలల పున:ప్రారంభం
TG: తెలంగాణలో నేటి నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. దసరా సందర్భంగా అక్టోబర్ 2 నుంచి 14 వరకు హాలిడేస్ ఇచ్చారు. 13 రోజుల పాటు సెలవులు కొనసాగాయి. ఇక జూనియర్ కాలేజీలు నిన్నటి నుంచి పున:ప్రారంభమయ్యాయి.
News October 15, 2024
మంత్రి నారాయణ 100 దరఖాస్తులు.. ఎన్ని గెలిచారంటే?
AP: తన గెలుపు కోసం పనిచేసిన నేతలు, కార్యకర్తల కోసం మంత్రి నారాయణ రూ.2 కోట్లతో 100 వైన్ షాపులకు దరఖాస్తులు చేశారు. వీటిలో 3 దుకాణాలు దక్కగా, ఒక్కో షాపును ఐదుగురికి ఇచ్చేశారు. అలాగే విజయవాడకు చెందిన ఓ బార్ ఓనర్ ఏకంగా 480 దరఖాస్తులు వేయగా 11 షాపులు దక్కించుకున్నారు. ఇక పెనుగంచిప్రోలులోని ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేసే రామకృష్ణ అనే వ్యక్తినీ అదృష్టం వరించింది. మొత్తం దుకాణాల్లో 10 శాతం మహిళలకే దక్కాయి.