News June 12, 2024

రేపటిలోగా శాఖలు కేటాయిస్తా: చంద్రబాబు

image

AP: పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. గతంలో తాను సీఎం(2014-19)గా ఉన్నప్పటి పరిస్థితి, ఆ తర్వాతి నుంచి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిని మంత్రులకు ఆయన వివరించారు. మంత్రుల అభీష్టాలు, వారి సమర్థత మేరకు రేపటిలోగా శాఖలు కేటాయిస్తా అని బాబు స్పష్టం చేశారు. ఇచ్చిన శాఖకు పూర్తిస్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మంత్రులదే అని చెప్పారు.

Similar News

News March 17, 2025

రేపు ఢిల్లీకి చంద్రబాబు

image

AP: అమరావతి పున: ప్రారంభ పనుల ఆరంభోత్సవానికి PM మోదీని ఆహ్వానించేందుకు CM చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. పీఎంతో ఆయన బుధవారం భేటీ కానున్నారు. ప్రపంచ బ్యాంకు నిధులు, అమరావతికి సాయం సహా వివిధ అంశాలపై ఆయన మోదీతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మల సహా పలువురు కేంద్రమంత్రులతో సమావేశమవుతారని సమాచారం.

News March 17, 2025

నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్.. ALL THE BEST

image

AP: నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఉ.9.30 నుంచి మ.12.45 వరకు పరీక్ష ఉంటుంది. ఉ.8.45 గం. నుంచే సెంటర్లలోకి అనుమతిస్తారు. 6.49 లక్షల మంది విద్యార్థుల కోసం 3,450 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లతో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. హాల్ టికెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
*Way2News తరఫున ALL THE BEST

News March 17, 2025

ఓపెన్ టెన్త్ ఎగ్జామ్స్ కూడా నేటి నుంచే..

image

AP: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే పదో తరగతి (ఓపెన్ టెన్త్) పరీక్షలు కూడా నేటి నుంచే ప్రారంభం కానున్నాయి. రెగ్యులర్ పరీక్షలు జరిగే తేదీలు, సమయాల్లోనే ఈ ఎగ్జామ్స్ ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఓపెన్ టెన్త్ పరీక్షలు ఈ నెల 28తో ముగియనున్నాయి. మొత్తం 30,334 మంది కోసం 471 సెంటర్లను ఏర్పాటు చేశారు.

error: Content is protected !!