News June 15, 2024
ఈ నెల 18న పీఎం కిసాన్ నిధుల జమ
పీఎం కిసాన్ స్కీమ్ 17వ విడత నిధులు ఈ నెల 18వ తేదీన విడుదల కానున్నాయి. రూ.2వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వారణాసి పర్యటనలో PM మోదీ ఈ నిధులను విడుదల చేస్తారని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ తెలిపారు. మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీ తొలి సంతకం ఈ నిధుల విడుదల దస్త్రంపైనే పెట్టారు. ఈ స్కీమ్ కింద ఏటా రూ.6వేలను(3 విడతల్లో రూ.2వేలు) రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రం అందిస్తోంది.
Similar News
News September 19, 2024
‘కూలీ’ మూవీ సీన్ లీక్‌పై డైరెక్టర్ రియాక్షన్
‘కూలీ’ మూవీ సీన్ లీక్ అవ్వడంపై డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ స్పందించారు. ‘ఒక్క రికార్డింగ్‌తో రెండు నెలలుగా మేం పడ్డ కష్టం వృథా అయింది. ఇలాంటివి ప్రోత్సహించొద్దని ప్రతి ఒక్కరిని కోరుతున్నా’ అని Xలో పోస్ట్ చేశారు. కాగా రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న కూలీ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫైట్ సీన్‌లో నాగార్జున ఉన్న వీడియోను కొందరు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.
News September 19, 2024
అక్టోబర్ 3 నుంచి దసరా నవరాత్రులు
AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రోజుకు లక్ష మందికి పైగా భక్తులు కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే అవకాశం ఉండటంతో వారికి తాగునీరు, పాలు, అల్పాహారం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం రోజు అమ్మవారికి ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
News September 19, 2024
జానీ మాస్టర్‌ది లవ్ జిహాదీనే: కరాటే కళ్యాణి
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై సినీ నటి కరాటే కళ్యాణి మండిపడ్డారు. ‘జానీ మాస్టర్‌ది కచ్చితంగా లవ్ జిహాదీ కేసే. దీనికి వ్యతిరేకంగా అందరూ పోరాటం చేయాలి. నిందితుడిగా తేలితే అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మతం మారితే పెళ్లి చేసుకుంటాననడం ఏమిటి? బాధితురాలికి అందరూ అండగా నిలవాలి’ అని ఆమె పేర్కొన్నారు.