News January 26, 2025
కేటీఆర్‌కు డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్

TG: కొత్త పథకాల మంజూరుకు ఈరోజు అంతం కాదు ఆరంభం మాత్రమేనని <<15268566>>KTRకు<<>> డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున లాంఛనంగా పథకాలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. BRS హయాంలో నిధులు అందుబాటులో ఉన్నా పథకాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. పేదలను పట్టించుకోని బీఆర్ఎస్ నేతలు ఇవాళ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నిత్యం ప్రజలకు పనికి వచ్చే నిర్ణయాలు తాము తీసుకుంటామని చెప్పారు.
Similar News
News February 18, 2025
9 మంది ESI ఆస్పత్రి ఉద్యోగులను సస్పెండ్ చేసిన మంత్రి

AP: రాజమహేంద్రవరం ESI ఆస్పత్రిలో 9మంది ఉద్యోగులపై సన్పెన్షన్ వేటు పడింది. కొందరు వైద్యులు, సిబ్బంది విధుల్లో లేకుండా సంతకాలు పెట్టి వెళ్లడాన్ని నిన్నటి ఆకస్మిక పర్యటనలో మంత్రి వాసంశెట్టి సుభాష్ గుర్తించి మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించగా.. రాష్ట్ర బీమా వైద్య సేవల డైరెక్టర్ ఆంజనేయులు ఇవాళ సస్పెండ్ చేశారు. ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్, ముగ్గురు డ్యూటీ డాక్టర్లు తదితరులపై వేటు పడింది.
News February 18, 2025
బీజేపీతో గుజరాత్ బంధం విడదీయరానిది: PM

గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల PM మోదీ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీతో గుజరాత్ బంధం విడదీయరానిదని, ఇది మరింత బలపడుతోందని తెలిపారు. అభివృద్ధి రాజకీయాలకు ఇది పెద్ద విజయం అని అభివర్ణించారు. GJలో 1912 వార్డులకు గాను బీజేపీ 1402, కాంగ్రెస్ 260, ఎస్పీ, ఆప్ కలిసి 236 వార్డులు గెలుచుకున్నాయి. 68 మున్సిపాలిటీల్లో బీజేపీ 57, కాంగ్రెస్ 1, ఎస్పీ 2, ఇతరులు 3 చోట్ల విజయం సాధించాయి.
News February 18, 2025
ఎల్లుండి ఢిల్లీకి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఎల్లుండి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి జరగాల్సిన ఏపీ క్యాబినెట్ భేటి వాయిదా పడింది.